ఇబ్బందుల్లో ఉన్నా.. అందుకే చోరీ చేస్తున్నా

Published on Tue, 04/08/2025 - 06:07

ఖర్గావ్‌: ‘జుజర్‌ భాయ్‌.. నిండా అప్పుల్లో మునిగి ఉన్నా..అప్పులోళ్లు రోజూ వేధించుకు తింటున్నారు..వాళ్లతో వేగలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దొంగతనం చేస్తున్నా..అదీ శ్రీరామ నవమి నాడు..! ఏమీ అనుకోకు, నీ డబ్బు మళ్లీ ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తా.. ఇది నా వాగ్దానం’అంటూ ఓ మంచి దొంగ ఓ దుకాణం నుంచి రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు. 

మధ్యప్రదేశ్‌లోని ఖర్గావ్‌ జిల్లా కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జమీదార్‌ మొహల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘరానా చోరీ ఘటన చోటుచేసుకుంది. మరునాడు దుకాణం తెరిచిన జుజర్‌ అలీ బొహ్రాకు నగదు ఉంచిన బ్యాగులో ఈ లేఖ కనిపించింది. ఆశ్చర్యపోయిన ఆయన విషయం పోలీసులకు తెలిపారు. చోరుడు ప్రింటెడ్‌ లేఖలో దుకాణం యజమానిని జుజర్‌ భాయ్‌ అంటూ మర్యాదగా సంబోధించాడని పోలీస్‌ ఎస్సై అర్షద్‌ ఖాన్‌ చెప్పారు. 

బ్యాగులో ఉంచిన రూ.2.84 లక్షలకు గాను అతడు రూ.2.45 లక్షలు మాత్రమే తీసుకెళ్లి, రూ.38వేలను లేఖతోపాటు బ్యాగులోనే వదిలివెళ్లాడని యజమాని తెలిపాడన్నారు. రామ నవమి పండగ నాడు ఇలా దొంగతనానికి పాల్పడుతున్నందుకు క్షమించాలని కూడా దుకాణం యజమానిని అతడు కోరినట్లు ఎస్సై వివరించారు. ‘నేనుండేది మీ చుట్టుపక్కల ప్రాంతంలోనే. నాకు చాలా అప్పులున్నాయి. 

అప్పిచ్చిన వాళ్లు రోజూ నా ఇంటికి వస్తున్నారు. దొంగతనం చేయాలని నాకు ఏ మాత్రంలేదు. కానీ, గత్యంతరం లేదు. ఈ డబ్బుతో నాకు చాలా అవసరముంది. అయితే, అవసరమైనంత మాత్రమే తీసుకెళ్తున్నా. మిగతాది బ్యాగులోనే వదిలిపెడ్తున్నా. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తా. అప్పుడిక మీరు నన్ను పోలీసులకు అప్పగించొచ్చు’అని అందులో వివరించాడు. అంతేకాదు, ఈ లేఖలో పేర్కొన్న ప్రతి విషయమూ సత్యమేనని స్పష్టం చేశాడన్నారు.   

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)