Breaking News

నాలుక కోసుకున్న యువకుడు.. ఆలయం రక్తసిక్తం

Published on Mon, 08/03/2026 - 08:41

గంజాం: కుటుంబ కలహాల కారణంగా ఒక యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఒక యువకుడు తన నాలుకను కోసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బెగునియాపడ పోలీసు స్టేషన్ పరిధిలోని హన్సతులి గ్రామానికి చెందిన కిరణ్ పాత్ర కుటుంబ తగాదాల కారణంగా గ్రామ సమీపంలోని కాళీ ఆలయం వద్ద ఈ చర్యకు  పాల్పడ్డాడు.

మీడియాకు అందిన  వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన కిరణ్, ఆలయం వెలుపల పదునైన కత్తితో తన నాలుకను కోసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ ద్వారా అతడిని తొలుత ఖళ్‌కోట్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బ్రహ్మపురంలోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధితుడు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఈజిప్ట్‌లో భూకంపం.. కెమెరాలో రికార్డయిన దృశ్యాలు

#

Tags : 1

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)