Breaking News

మిస్‌ అయిన ఫోన్‌ దొరికితే...ఆ ఆనందం వేరే లెవల్‌!

Published on Wed, 01/21/2026 - 15:10

స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేనిదే రోజుగడవని పరిస్థితి. అంత అలవాటైపోయిన మొబైల్‌ పోగొట్టుకుంటే మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. దాని మీద ఆశలు వదిలేసు కుంటాం. కానీ పోయిందనుకున్న ఫోన్‌  అనూహ్యంగా మళ్లీ మన చేతికి వస్తే భలే ఆనందంగా ఉంటుంది కదా. సరిగ్గా ఒక మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ  ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన వీడియో  ఒకటి నెట్టింట తెగ సందడి  చేస్తోంది.

టీవల చెత్తలో దొరికిన 45 లక్షల బంగారం, కార్మికురాలు నిజాయితీగా తిరిగి వచ్చిన వైరల్‌ అయింది. ఇది కూడా అలాంటి హృదయానికి హత్తుకునే ఘటన లాంటిదే. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రఘు అహిర్వర్ ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. దీని ప్రకారం తాను, తన సోదరితో కలిసి గ్రామం నుండి ఇండోర్‌కు ప్రయాణిస్తున్నప్పుడు, సోదరి ఒక మొబైల్‌ను గుర్తించింది. అదృష్టవశాత్తూ అన్‌లాక్‌లోనే ఉంది. దీంతో వారు  కాల్‌లిస్ట్‌లోకి వెళ్లి లాస్ట్‌ కాల్‌ చేసిన నంబరుకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. అహిర్వర్ ఫోన్‌ పోగొట్టుకున్నమహిళను కలుసుకుని, ఆమెకు ఫోన్‌ను తిరిగి ఇచ్చాడు. దీంతో ఆమె తెగ సంతోష పడిపోయింది. పదే పదే అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అహిర్వర్‌కు బదులుగా, వేరే ఎవరికికైనా దొరికితే తన ఫోన్‌ తన చేతికి తిరిగి వచ్చేది కాదంటూ భావోద్వేగానికి లోనైంది.

 ఫోన్‌ అన్‌లాక్‌లో ఉండటం చూస్తే పాపం.. వారికి ఫోన్‌ టె​క్నాలజీ గురించి తెలియదని అర్థం అయిపోయిందని, వెంటనే వారికి ఫోర్‌ చేశామని అహిర్వర్‌ పేర్కొన్నారు. ‘‘దేవుడు మనకు ఈ మొబైల్ ఇవ్వడం మంచిది" అనే క్యాప్షన్‌తో ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలను దక్కించుకుంది. అతని నిజాయితీ  పలువురి హృదయాలను గెలుచుకుంది."ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే, ప్రపంచం మెరుగుపడుతుంది" అని ఒకరు, విలువైన వస్తువులను తిరిగి ఇవ్వడం గ్రేట్‌ బ్రో అని ఒకరు, "నిజ జీవిత హీరో" అని మరికొందరు వ్యాఖ్యానించడం విశేషం.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)