Breaking News

ప్రియురాలి కోసం ప్రియుడి సాహసం.. కట్‌ చేస్తే

Published on Mon, 06/01/2026 - 12:45

ప్రియురాలి కోసం సరిహద్దులు దాటే సాహసం చేసిన ఒక యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆన్‌లైన్‌లో పరిచయమైన జమ్మూ కాశ్మీర్ యువతిని కలవడానికి  పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని (పీవోకే) ముజఫ్ఫరాబాద్‌కు చెందిన యువకుడు జీషాన్‌ మిర్‌ (22)ని నియంత్రణ రేఖ (LoC) భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. విచారణలో అసలు విషయం చెప్పాడు.  దీంతో ఈ స్టోరీ నెట్టింట్‌ వైరల్‌గా మారింది.

జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌కు చెందిన  ప్రియురాల్ని  కలవాలన్న అతని కోరికకు  సరిహద్దు గీత వద్దే ఎదురు దెబ్బ తగిలింది.  ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్ పరిధిలోని 'సిలికోట్' ప్రాంతంలో ఒక వ్యక్తి నియంత్రణ రేఖ దాటి రావడాన్ని సైనికులు గమనించారు. అతను భారత భూభాగంలోకి అడుగుపెట్టిన వెంటనే సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో అతను పీఓకేలోని ముజఫరాబాద్‌కు చెందిన పెయింకాడి నివాసి జీషాన్ అహ్మద్ మీర్ (తండ్రి లాల్ దిన్ మీర్) గా గుర్తించారు. అతని వద్ద ఉన్న పాకిస్తానీ గుర్తింపు కార్డు (ID Card)ద్వారా అతని వివరాలను ధృవీకరించారు. 

సోషల్ మీడియా ద్వారా ఉరి ప్రాంతానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆమెను కలుసుకోవడానికే తాను ప్రాణాలకు తెగించి సరిహద్దు దాటానని జీషాన్ భద్రతా సిబ్బందికి తెలిపాడు. ప్రస్తుతం జీషాన్‌తో పాటు అతను చెప్పిన యువతిని కూడా భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. వారి మధ్య జరిగిన డిజిటల్ సంభాషణలను (చాట్స్) అధికారులు పరిశీలిస్తున్నారు.

సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు సోపోర్ యువకుల అరెస్ట్
మరొక ఘటనలో, శనివారం మరియు ఆదివారం మధ్య రాత్రి హత్లంగా-నంబ్లా మార్గం ద్వారా పీఓకేలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు సోపోర్ నివాసితులను సైన్యం అదుపులోకి తీసుకుంది.  వీరిలో  ఆదిల్ హుస్సేన్ దార్, ఇష్ఫాక్ అహ్మద్, జాఫర్ అహ్మద్‌లుగా గుర్తించారు. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న టెరిటోరియల్ ఆర్మీ (TA-161) సిబ్బంది కావడం గమనార్హం.వారు నియంత్రణ రేఖను చేరుకోవడానికి ముందే నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ వారిని పట్టుకుంది. వీరు సరిహద్దు దాటడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.

ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్‌ఫ్లూయెన్సర్‌

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)