Breaking News

ఏసీ రైలు బోగీలో దీప ధూపాలతో పూజ : నెటిజన్లు ఫైర్‌

Published on Tue, 07/28/2026 - 14:44

సాక్షి,న్యూఢిల్లీ : రైలు ప్రయాణంలో జరిగిన ఒక వింతలు,  విడ్డూరలాలతో ప్రమాదకరమైన వీడియోలు ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయాయి. కదులుతున్న రైలు ఏసీ బోగీలో ఒక ప్రయాణీకుడు  నూనె ప్రమిదలో దీపారాధన, ధూపంతో పూజలు చేసిన వింత సంఘటన  సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఎక్స్‌లో షేర్‌  చేసిన వీడియోప్రకారం బనియన్, ధోతీ ధరించిన వ్యక్తి రైలు ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని అప్పర్ బెర్త్‌పై మత కార్యక్రమాలు నిర్వహించాడు. ఏకంగా ధూపదీప నైవేద్యాలతో చేతులు జోడించి పూజ చేసిన వైనం తోటి ప్రయాణీకుల్లో అలజడి రేపింది. ఇది ప్రయాణికుల భద్రతకు తీవ్ర ముప్పు అని, మంటలు లేదా పొగ కారణంగా ఫైర్ అలారం మోగే ప్రమాదం ఉందని తోటి ప్రయాణికులు వారించారు.

వీడియో తీస్తున్న ప్రయాణికుడు ఆ వ్యక్తిని "పండిత్ జీ" అని వరుసగా పిలుస్తూ ప్రశ్నించి నప్పటికీ, ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా పూజలోనే మునిగిపోయాడు. ఆయన తమతో వచ్చిన పండితుడు కాదని మిగిలిన ప్యాసింజెర్స్‌ కూడా చెప్పారు. అనంతరంధూపం నుంచి వచ్చే పొగ వల్ల ఏసీ బోగీలోని 'ఫైర్ అలారమ్' మోగే అవకాశం ఉందనీ, పైగా వెలుగుతున్న ప్రమిద వల్ల రైలులో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకునే ప్రమాదం ఉందని గట్టిగా హెచ్చరించాడు.

Viral Video: వీడి భక్తి తగలెయ్యా... AC కోచ్ లో అగరుబత్తి.. దీపం..!

ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!

నెటిజన్ల ఆగ్రహం
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రైల్వే భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు: మత స్వేచ్ఛ వేరు, భద్రత వేరు, ఎవరి నమ్మకాలు, ఆచారాలు వారికి ఉన్నప్పటికీ, వందలమంది ప్రయాణించే ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇలాంటి నిప్పుతో కూడిన పూజలు చేయడం అత్యంత ప్రమాదకరమని నెటిజన్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఏడేళ్లు భర్త వేళ్లు కొరుకుతూ...చివరకు ‘ఐ లవ్‌యూ’ చెప్పాడు!

రైల్వే మంత్రిత్వ శాఖ (@RailMinIndia) వెంటనే ఈ విషయంపై దృష్టి సారించి, ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీని వలన ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఇతనిపై భారీగా జరిమానాతోపాటు, రైలు ప్రయాణాలు చేయకుండా నిషేధించి జైలుకు పంపాలని పలువురు కామెంట్ చేశారు.ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్‌

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)