Breaking News

తల్లిదండ్రులను, సోదరిని చంపి ఇంట్లోనే పూడ్చాడు

Published on Sat, 01/31/2026 - 13:20

సాక్షి,బళ్లారి: నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని, కుమారుడి భవిష్యత్తు కోసం కలలు కన్న తండ్రిని, ఆప్యాయత అనురాగాలను పంచిన సోదరిని కూడా ఓ కర్కోటకుడు దారుణంగా హత్య చేసిన ఘటన విజయనగర జిల్లా కొట్టూరులో వెలుగు చూసింది. కొట్టూరు పట్టణంలో కన్న తల్లిదండ్రులను, సోదరిని హత్య చేసిన నిందితుడు అక్షయ్‌ బెంగళూరులోని తిలక్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన తల్లిదండ్రులు, సోదరి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. 

అయితే అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో తల్లిదండ్రులు భీమరాజ్‌(50), జయలక్ష్మి(45), సోదరి అమృత(17)లను తానే హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టానని చెప్పడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే సమాచారాన్ని విజయనగర జిల్లా ఎస్పీ జాహ్నవికి అందించారు. దీంతో ఎస్పీ నేతృత్వంలో కొట్టూరు డీఎస్పీ మల్లేష్‌ దొడ్డమని, సీఐ, వేలిముద్రల నిపుణులు,  జాగిలంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మరో వైపు నిందితుడిని వెంటబెట్టుకొని బెంగళూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఎందుకు, ఎప్పుడు హత్య చేశాడు? అనే కోణంలో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కొట్టూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.  

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)