Breaking News

రోడ్డుపక్కన చిన్న ఫుడ్‌ స్టాల్‌.. మరీ ఇంతగా సంపాదిస్తున్నాడేంటీ?

Published on Tue, 07/21/2026 - 21:25

రోడ్డుపక్కన ఫుడ్‌ స్టాల్‌ నడిపే వ్యక్తి నెలవారీ ఆదాయం గురించి తెలుసుకున్న ఓ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఇందుకు సంబంధించిని వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సాంప్రదాయ ఉద్యోగాలపై ఉన్న అభిప్రాయాలు, రోడ్డుపక్కన వ్యాపారం చేసే వారిపై ఉన్న భావనలపై చర్చ మొదలయ్యేలా చేసింది ఈ వీడియో. 

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో ఒక డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ చిరుతిళ్లు అమ్మే ఫుడ్‌ స్టాల్‌ను సందర్శించింది. అతను నెలకు సుమారు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్నాడని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. తన జీతం మాత్రం చెప్పుకునే స్థాయిలో లేదని సరదాగా చెప్పింది.

"రోడ్డుపక్కన బండి పెట్టి అమ్మితే ఏమి వస్తుంది? అని అనుకునే వారు ఈ వీడియో చూసి తమ ఆలోచన మార్చుకోవాలి" అని డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ కోమల్‌ నేగి ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది. వీడియో ప్రారంభంలో కోమల్‌ నేగి రోడ్డుపక్కన ఉన్న ఒక ఫుడ్‌ స్టాల్‌ను చూపించింది. అక్కడ ఒక వ్యక్తి మ్యాగీ, ఛోలే-కుల్చే వంటి వంటకాలు అమ్ముతున్నాడు. అతనితో మాట్లాడిన సమయంలోనే నెలకు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పాడు.

సోషల్‌ మీడియాలో స్పందన 
ఈ వీడియో చూసిన చాలామంది నవ్వు ఎమోజీలతో స్పందించారు. ఒకరు "అతను నాకు ఉద్యోగం ఇస్తాడా?" అని కామెంట్‌ చేశారు. ఇంకొకరు "ఆదాయపు పన్ను లేదు, అద్దె లేదు" అని పేర్కొన్నారు. ఇంకొకరు "అతను కష్టమైన శారీరక శ్రమ చేస్తున్నాడు. నువ్వు చేయడం లేదు. ఈ పోలిక సరైంది కాదు" అని రాశారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)