Breaking News

భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే.. వాళ్లు బతికిపోయారు

Published on Wed, 12/17/2025 - 15:04

లక్నో:  ఉత్తరప్రదేశ్‌లోని షామ్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వల్ప వివాదానికే ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేశాడు. అంతేకాదు ముగ్గురు బాధితుల మృతదేహాలను వారి ఇంటి ప్రాంగణంలోని ఏడు అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టినట్లు  పోలీసులు గుర్తించారు. తల్లీ పిల్లలు  ఆరు రోజులుగా కనిపించకుండా పోవడంతో అందిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది.  విచారణలో, ఫరూఖ్ నేరం అంగీకరించాడని తెలుస్తోంది.

నిందితుడిని కాంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామానికి చెందిన ఫరూక్‌గా గుర్తించారు.  పోలీసుల ప్రకారం, ఫరూక్ తన భార్య తాహిరా (32) బుర్ఖా ధరించకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు ప్రారంభమైన వాగ్వాదం తీవ్రమైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త  తొలుత భార్యను కాల్చి చంపాడు.  ఆ తరువాత కుమార్తెలు అఫ్రీన్ (14) , సెహ్రీమ్ (7)కూడా పొట్టనబెట్టుకున్నాడు.

ఈ జంటమధ్య గత కొన్ని నెలలుగా తరచుగా గొడవలు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ వివాదాలతో ఫరూక్  తల్లిదండ్రులు దావూద్ ,అస్గారి నుండి విడిగా ఉంటున్నాడు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు, వారిలో ముగ్గురు సంఘటన సమయంలో లేనందున ప్రాణాలతో బయటపడ్డారు. డిసెంబర్ 9-10 రాత్రి హత్యలు జరిగాయని పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ పి సింగ్ తెలిపారు. టీ తయారుచేసే నెపంతో ఫరూఖ్ తన భార్యను నిద్రలేపి, ఆపై ఆమెను , పెద్ద కుమార్తెను కాల్చి చంపాడు. ఈ దారుణాన్ని చూసిన చిన్న కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లోనే లోతైన గొయ్యి తవ్వి, మృతదేహాలను పాతిపెట్టి, ఆ ప్రదేశాన్ని ఇటుకలతో కప్పేశాడ. పథకం ప్రకారం ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు.  మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆర్థిక ఒత్తిడి, తరచుగా వాదనలు, కోపం, అవమాన భారంతోనే ఈ తప్పు చేశానని ఫరూఖ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు