Breaking News

ప్రమాదమే కాపాడింది.. అసలేం జరిగిందంటే..

Published on Tue, 01/13/2026 - 11:44

ధార్వాడ్‌: కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది. బైక్ ప్రమాదానికి గురవ్వడంతో నిందితుడు పట్టుబడగా.. చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. ధార్వాడ్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మూడో తరగతి చదువుతున్న తన్వీర్ దొడ్మని, లక్ష్మి కరియప్పనవర్ అనే ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.

విరామం తర్వాత పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. వారు కిడ్నాప్‌కు గురయ్యారని అనుమానించారు.  దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఓ వ్యక్తి ఆ పిల్లలిద్దరినీ బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. నిందితుడిని కరీం మేస్త్రీగా గుర్తించారు.

పిల్లలను తీసుకుని వెళ్తున్న క్రమంలో నిందితుడు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న దండేలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గాయపడిన వ్యక్తితో పాటు ఇద్దరు పిల్లలు ఉండటాన్ని గమనించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి.. తాను పిల్లలను "ఉలవి చెన్నబసవేశ్వర జాతరకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాడు. అయితే కిడ్నాప్ ఉద్దేశంతోనే వారిని తీసుకువెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు