Breaking News

పెళ్లయిన 24 గంటలకే... ఎంత దారుణం..

Published on Wed, 12/03/2025 - 11:13

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వరకట్న వేధింపుల దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాన్పూర్‌లోని జుహి ప్రాంతానికి చెందిన లుబ్నా, మొహమ్మద్ ఇమ్రాన్‌లకు నవంబర్ 29న ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం జరిగింది.  కోటి కలలతో లుబ్నా మరుసటి రోజు తన అత్తమామల ఇంటిలో అడుగుపెట్టింది. అయితే ఆమె కలలు 24 గంటలు ముగియకుండానే కల్లలయ్యాయి. అదనపు కట్నం కోసం ఆమెను వేధించి, భర్త ఇమ్రాత్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు లుబ్నాను బయటకు గెంటేశారు.

లుబ్నా తన అత్తమామల ఇంటికి వచ్చిన వెంటనే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ లేదా దానికి బదులుగా రెండు లక్షల నగదు ఇవ్వాలని వరుడి కుటుంబం డిమాండ్ చేసింది. ‘నేను ఇంటికి వచ్చిన వెంటనే గొడవ మొదలైంది. మాకు బుల్లెట్ బైక్ ఇవ్వలేదు.. వెంటనే ఇంటికి వెళ్లి రూ. రెండు లక్షలు తీసుకురా అంటూ వారు తనను కొట్టడం ప్రారంభించారు’ అని లుబ్నా పోలీసులకు వివరించింది. అత్తామామలు తనను కొట్టడమే కాకుండా, తమ పుట్టింటివారు పెట్టిన నగలు, నగదును కూడా వారు బలవంతంగా తీసేసుకున్నారని బాధితురాలు ఆరోపించింది.

లుబ్నా తల్లి మెహతాబ్ మాట్లాడుతూ తమ కుమార్తె వివాహానికి లక్షలు ఖర్చు చేశామని, తమ శక్తి మేరకు సోఫా సెట్, టీవీ, వాషింగ్ మెషిన్, కిచెన్ సామాగ్రి తదితర విలువైన బహుమతులు ఇచ్చామని తెలిపారు. పెళ్లికి ముందు బైక్ డిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావన తేలేదని, ఒకవేళ ముందే  అడిగి ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకోమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తమ కుమార్తె కన్నీటితో ఇంటికి వచ్చి జరిగిన దారుణాన్ని వివరించిందని మెహతాబ్ తెలిపారు.

ఈ ఘటనపై లుబ్నా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మొహమ్మద్ ఇమ్రాన్, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని, పెళ్లికి ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని లుబ్నా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వరకట్న దాహంతో పెళ్లైన మరుసటి రోజే కొత్త కోడలిని వేధింపులకు గురిచేసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఇది కూడా చదవండి: చూపు లేకున్నా.. శరీరం సహకరించకున్నా..
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)