Breaking News

నాన్నా.. వదిలిపెట్టు, భయమేస్తోంది!

Published on Wed, 06/11/2025 - 10:56

అనుమానం పెనుభూతమైంది. క్షణికావేశంలో ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం.. మొత్తం ఐదు నిండు ప్రాణాలను బలిగొంది. భార్య వివాహేతర సంబంధంలో ఉందన్న అనుమానంతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ భర్త.. కొన్ని గంటల్లోనే నలుగురు కొడుకులతో కలిసి పట్టాలపై శవమై కనిపించాడు. బీహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘోర ఘటన వివరాల్లోకి వెళ్తే.. 

ఫరిదాబాద్‌కు చెందిన మనోజ్‌ మాహట్టో(45) భార్య ప్రియతో తరచూ గొడవ పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో ఆ భర్త తన నలుగురు పిల్లలు పవన్‌(10), కరు(9), మురళి(5), చోటు (3)లను తీసుకుని బయటకు వచ్చేశాడు. మధ్యాహ్నాం దాకా సమీపంలోని ఓ పార్క్‌లో సేదతీరాడు. పిల్లలకు చిప్స్‌, కూల్‌డ్రింక్స్‌ కొనిచ్చి సరదాగా గడిపాడు. ఆపై వాళ్లను తీసుకుని సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్దకు వెళ్లాడు. 

భుజాలపై చెరోవైపు.. చెరోకరిని, మిగతా ఇద్దరిని రెండు వైపులా చేతులు పట్టుకుని పట్టాలపై నడిపిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడో ఆ పిల్లలకు అప్పటిదాకా అర్థం కావడంలేదు. మరికాసేపట్లో భల్లాబ్‌గఢ్‌ స్టేషన్‌కు గోల్డెన్‌ టెంపుల్‌ ఎక్స్‌ప్రెస్‌ చేరుకోవాల్సి ఉంది. స్టేషన్‌ మరో కిలోమీటర్‌ దూరం ఉందనగా.. పట్టాలపై నలుగురు పిల్లలతో మనోజ్‌ నిల్చున్నాడు. 

అయితే పట్టాలపై పిల్లలతో వ్యక్తి నిల్చున్న విషయం గమనించిన లోకో పైలట్‌ హారన్‌ కొడుతూ రైలును ఆపే ప్రయత్నం చేశాడు. అయినా మనోజ్‌లో చలనం లేదు. రైలు దగ్గరగా వస్తుండడంతో భయంతో ఆ పిల్లలు రోదించ సాగారు. తమను వదిలిపెట్టమని పవన్‌, కరులు గింజుకుంటున్నారు. అయినా ఆ తండ్రి చలించలేదు. వాళ్లను బలంగా అదిమి పట్టుకున్నాడు. చివరకు రైలు వచ్చి ఢీ కొట్టడంతో ఆ ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 

ఆపై కాస్త దూరంలో రైలు ఆగడంతో.. లోకో పైలట్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఆపై పోలీసులు వచ్చి మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మనోజ్‌ జేబులో సూసైడ్‌ నోట్‌ లభించగా.. అందులో తన భార్యే కారణమని రాసి ఉంది. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)