Breaking News

Vadodara: కారుతో నలుగురిని ఢీకొని.. ‘అనెదర్‌ రౌండ్‌’ అంటూ..

Published on Fri, 03/14/2025 - 08:57

వడోదర: గుజరాత్‌లోని వడోదర(Vadodara)లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఒక యువకుడు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడిపి, పలువురిని ఢీకొన్నాడు. ఈ ఘటన  కరోలీబాగ్‌లోని ఆమ్రపాలీలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ రోడ్డు ప్రమాదం జరిగిన దరిమిలా జనం సంఘటనా స్థలంలో గుమిగూడారు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌(Traffic jam)  అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్‌ బ్యాగ్‌ కూడా తెరుచుకుంది. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉండటాన్ని స్ణానికులు గుమనించారు. అతను గట్టిగా అరుస్తూ కారు నడిపాడని వారు తెలిపారు. ‍ప్రమాదం జరిగిన అనంతరం కారు దిగిన ఆ యువకుడు ‘అనెదర్‌ రౌండ్‌’ అంటూ అరవసాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డీసీపీ పన్నా మోయాన్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఒక  మహిళ మృతి చెందిందని, నలుగురు గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేశామని, అతనిని వారణాసికి చెందిన రవీష్‌ చౌరాసియాగా గుర్తించామన్నారు. రవీష్‌ లా చదువుకుంటున్నాడని, ప్రమాదం జరిగిన సమయంలో అతని స్నేహితులకు కూడా అతనితో పాటు ఉన్నారని, ఆ తరువాత పరారయ్యారన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు(Police teams) గాలిస్తున్నాయన్నారు. కారు ఓవర్‌ స్పీడ్‌ కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: కార్గిల్‌లో భూకంపం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)