Breaking News

ప్రియుడి కోసం... భర్త ఖతం

Published on Sat, 11/08/2025 - 07:27

మీరట్: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి గుట్టుగా నడుపుతున్న ప్రేమ వ్యవహారం ఆమె భర్తకు తెలిసింది. దీనిని గ్రహించిన ఆమె భర్త ఎక్కడ రచ్చ చేస్తాడోనని భయపడి, అతనిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడి సాయం తీసుకుంది. ఒక ప్లాన్‌ ప్రకారం భర్త అడ్డు తొలగించుకుంది. అయితే ఆ తర్వాత చట్టం ఏం చేసింది?

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఒక యువకుని మృతదేహం  అతను ఉంటున్న గ్రామం వెలుపలి పొలంలో పోలీసులకు కనిపించింది. మృతదేహంపై మూడు బుల్లెట్ల గుర్తులు కనిపించాయి. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత దీనిని దోపిడీ కోసం చేసిన హత్యగా భావించారు. అయితే తదుపరి దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పోలీసులు అగ్వాన్‌పూర్ గ్రామంలో ఉంటున్న మృతుడి భార్య అంజలి విచారించేందుకు ఉపక్రమించగా, ఆమె ఇంటి నుంచి పరారైనట్లు తేలింది. అయితే అంజలికి అదే గ్రామానికి చెందిన అజయ్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు కనుగొన్నారు.

దీంతో పోలీసులు అజయ్‌ను విచారించేందుకు ప్రయత్నించారు. అయితే అతను కూడా ఇంట్లో లేడని తెలిసింది. ఈ జంట అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తరువాత పోలీసులు వారికోసం వెదుకులాట సాగించి, ఎట్టకేలకు అదుపులోనికి తీసుకున్నారు. విచారణ సమయంలో అజయ్ నిజం వెల్లడించాడు. అంజలి భర్త రాహుల్  తమ సంబంధం గురించి తెలుసుకున్నాడని, దీంతో అంజలి కలత చెందిందని, తరువాత ఆమె భర్తను చంపేందుకు ఒక ప్లాన్‌ చేసిందని అతను చెప్పాడు. ఈ నేపధ్యంలోనే అజయ్ స్వయంగా రాహుల్‌ను పొలాల దగ్గర కలుసుకుందామని చెప్పాడు. అతను రాగానే అతనిపై రాహుల్‌ మూడుసార్లు తుపాకీ కాల్పులు జరిపాడని దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. 

ఇది కూడా చదవండి: ట్రంప్‌కు ‘శాంతి బహుమతి’?.. డిసెంబర్‌ ఐదున ప్రదానం

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)