Breaking News

ఎన్‌ఆర్‌సీ ఎఫెక్ట్‌: బంగ్లాకు పంపుతారని వృద్ధుని బలవన్మరణం

Published on Mon, 08/04/2025 - 09:46

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని రీజెంట్ పార్క్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) అమలు చేస్తే, తనను బంగ్లాదేశ్‌కు పంపుతారనే భయంతో దిలీప్ కుమార్ సాహా(63) ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

కోల్‌కతాలోని తన ఇంట్లో దిలీప్ కుమార్ సాహా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో దిలీప్ కుమార్ సాహా 1972లో ఢాకాలోని నవాబ్‌గంజ్ నుండి కోల్‌కతాకు వచ్చాడు. ఇక్కడి రీజెంట్ పార్క్ ప్రాంతంలోని ఆనందపల్లి వెస్ట్‌లో నివసిస్తున్నాడు. సాహా దక్షిణ కోల్‌కతాలోని ధకురియాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బోధనేతర సిబ్బందిగా పనిచేశాడు. అతను ఉంటున్న ఇంటికి అతని భార్య పలుమార్లు ఫోన్‌  చేసింది.

అయితే అతని నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆమె పొరుగింట్లో ఉంటున్న మేనకోడలికి ఫోన్ చేసింది. ఆమె.. దిలీప్ కుమార్ సాహా ఇంటి తలుపులను పగలగొట్టి, లోనికి చూడగా అతను సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా అతని భార్య ఆరతి సాహా మీడియాతో మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సీ అమలు తర్వాత బంగ్లాదేశ్‌కు బహిష్కరిస్తారేమోనని తన భర్త ఆందోళన చెందుతుండేవాడని తెలిపారు. కాగా దిలీప్ కుమార్ సాహా గది నుంచి పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యుత్ మంత్రి, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరూప్ బిశ్వాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు.
 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)