Breaking News

ఇద్దరు భార్యల ముద్దుల భర్త.. చెరో పదిహేను రోజులు..

Published on Tue, 08/29/2023 - 13:07

భోపాల్‌:వివాహం అనేది మనిషి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. సంతోషాలతో పాటు కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. దంపతుల మధ్య విభేదాలు రావడం, పరిష్కరించుకోవడం నిత్యం జరిగేపనే. అయితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో ఓ వ్యక్తికి కూడా వివాహ జీవితంలో ఓ క్లిష్టపరిస్థితి ఎదురైంది. మరి ఆ చిక్కుముడిని పరిష్కరించుకున్న తీరు చూస్తే ఆశ్చర్యపోతారు..!

మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడో వ్యక్తి. రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్యతో కలిసి జీవించడానికి ఆసక్తితో ఉన్నాడు. రెండు పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తను విడిచి పెట్టడానికి మొదటి భార్య అంగీకరించలేదు. తన భర్తతోనే ఉంటానని కోరింది. కానీ ఈ విషయం రెండో భార్యకు నచ్చలేదు.

మొదటి భార్యను పదిహేను ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండటంతో ఆమె ఉండగానే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తను విడిపోవడానికి మొదటి భార్య ఒప్పుకోలేదు. కానీ రెండో భార్య ఇందుకు ఇష్టపడలేదు. దీంతో ఆమె న్యాయపరమైన మార్గాన్ని అనుసరించింది.

కేసు నమోదు చేయడంతో ఈ గొడవ పరామర్శ కేంద్రాన్ని చేరింది. వీరికి సమస్యకు ఏం పరిష్కారం ఇవ్వాలో తెలియక అధికారులు తికమకపడ్డారు. ఇక నెలరోజులను చెరో పదిహేను చొప్పున పంపకాలకు అందరూ అంగీకరించడంతో వివాదం ముగిసింది. మరి ఈ రకమైన జీవిత విధానానికి మీరేమంటారు...?

ఇదీ చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్‌ తలాక్‌!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)