Breaking News

పశ్చిమ బెంగాల్‌లో టీవీ ఛానెల్స్‌ బహిష్కరించిన దీదీ సర్కార్‌

Published on Mon, 09/02/2024 - 11:41

కోల్‌కతా :  పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపింది.  రాష్ట్రంలో మూడు టీవీ ఛానెల్స్‌పై సీఎం మమతా బెనర్జీ నిషేధం  విధించారు.

అభయ ఘటన అనంతరం జరగుతున్న పరిణామలపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అభయ ఘటనపై రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతుందంటూ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా పలు టీవీ ఛానెల్స్‌ అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఎవరు సదరు ఛానెల్స్‌ నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు ఇవ్వడంలాంటివి చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు.

కేంద్రం బీజేపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ..టీవీ ప్రమోటర్లు ఈడీ,సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ జమీందార్‌లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం వారిని అర్ధం చేసుకున్నామని ఎద్దేవా చేశారు. ఈ మేరకు దీదీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

టీవీ చర్చలో రచ్చ
కొద్ది రోజుల క్రితం ఏబీపీ ఆనంద టీవీలో చర్చ జరిగింది. ఆ చర్చలో అభయ కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారంటూ తృణమూల్ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్..  బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ దస్తిదార్.. ఎమ్మెల్యే ‌అగ్ని మిత్ర పాల్‌ను ‘శారీ మేకర్‌’ అంటూ వ్యాఖ్యానించారు. అందుకు నా వృత్తిపై నాకు గర్వంగా ఉందన్న అగ్నిమిత్ర పాల్‌.. మమతా బెనర్జీ ప్రభుత్వం నేరస్థులకు ఆశ్రయం కల్పిస్తోందని, మహిళల కష్టాలను పట్టించుకోదని ఆరోపించారు.  

చివరగా శారీ మేకర్‌ వ్యాఖ్యలపై ఎంపీ దస్తిదార్‌, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దస్తిదార్‌ క్షమాపణలు చెప్పి వివాదానికి పులిస్టాప్‌ పెట్టారు. తాజా పరిణామాలతో దీదీ పశ్చిమ బెంగాల్‌లో మూడు టీవీ ఛానెల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు అధికారంగా ప్రకటన చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)