Breaking News

స్థానిక గొడవే అది.. హైకమాండ్‌ సృష్టించలేదు

Published on Mon, 12/22/2025 - 04:25

శివాజీనగర: కర్ణాటకలో సీఎం పదవి వివాదంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం కల్బుర్గిలో మీడియాతో మాట్లా­డుతూ  ‘దీనిని  హైకమాండ్‌ సృష్టించలేదు. గందరగోళానికి హైకమాండ్‌ కారణం కాదు. స్థానిక నాయకులే గొడవ చేసుకున్నారు. వారే దీనిని పరిష్కరించుకోవాలి. అన్నిటికీ హైకమాండ్‌ను అంటే ఎలా?’ అని పేర్కొన్నారు.  

కాంగ్రెస్‌ ఎవరో ఒక నాయకుడి వల్ల బలపడలేదని,  తన వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని, తానే పార్టీ కోసం శ్రమించానని ఎవ్వరూ చెప్పరాదని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌ అనేది కార్యకర్తల ద్వారా విస్తరించిన పార్టీ. పార్టీ అన్న తరువాత అందరి పాత్ర ఉంటుంది. ఫలానా వారే పార్టీకి ఆధారం అని కార్యకర్తలు కూడా అనరాదు’ అని సూచించారు. 

సోదరుల్లాగా పనిచేసుకుంటున్నాం: శివకుమార్‌ 
మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆదివారం బెంగళూరులో తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ తనకు కాంగ్రెస్‌లో ఏ నాయకుడితో భిన్నాభిప్రాయాలు లేవన్నారు. అవన్నీ మీడియా, ప్రతిపక్షాల సృష్టి అని పేర్కొన్నారు.  తాను, సీఎం సిద్ధరామయ్య కలసికట్టుగా సోదరుల్లాగా పని చేయడం లేదా? అని ప్రశి్నంచారు. ‘కొన్ని సందర్భాల్లో రాజకీయంగా వ్యాఖ్యలు చేసి ఉంటారు. 

ఇందుకు అసంతృప్తికి గురికావాలా?, అన్నదమ్ములే గొడవపడుతుంటారు. ఇక మా గొడవ అనేది ఏ లెక్కకు వస్తుంది?’ అని ప్రశ్నించారు.  పార్టీలో గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని మల్లికార్జున ఖర్గేకు కొందరు నాయకులు లేఖ రాయడంపై మాట్లాడుతూ,  ‘నా వరకు ఎలాంటి గందరగోళం లేదు. మీడియాకు వార్తలు కావాలి, అందుకోసమే రోజూ గందరగోళం చేయిస్తున్నారు’ అని అన్నారు. 

సీఎం సన్నిహిత వర్గానికి చెందిన నేత కేఎన్‌ రాజన్న కలవడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘ఆయనకు సీఎం సన్నిహితుడా?, నాకు కూడా సన్నిహితుడే’  అని చమత్కరించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)