Breaking News

కేఐఏడీబీకి భూమిని తిరిగిచ్చేసిన రాహుల్‌ ఖర్గే

Published on Mon, 10/14/2024 - 06:00

బెంగళూరు/శివాజీనగర: కర్ణాటకలో ముడా స్కాం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు రాహుల్‌ ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్‌ ట్రస్ట్‌ ‘మల్టీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌’ఏర్పాటుకు బెంగళూరులో ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలనే అభ్యర్థనను ఉపసంహరించుకున్నారు. 

ఈ మేరకు సెప్టెంబర్‌ 20న కర్ణాటక పారిశ్రామిక అభివృద్ధి బోర్డు (కేఐఏడీబీ)కు రాసిన లేఖలో రాహుల్‌ ఖర్గే పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎమర్జింగ్‌ టెక్నాలజీలో మరిన్ని ఉద్యోగావకాశాలు కలి్పంచడమే సిద్ధార్థ విహార్‌ ట్రస్ట్‌ లక్ష్యమన్నారు. కళాశాల విద్యను అభ్యసించలేని విద్యార్థులకు సహాయం చేయడానికి కూడా దీనిని రూపొందించామని పేర్కొన్నా రు. పరిశ్రమలకు దగ్గరగా ఉండటం వల్ల యువతకు అవకాశాలు పెరుగుతాయనే కేఐఏడీబీ ఇండ్రస్టియల్‌ ఏరియాను ఎంచుకున్నామని లేఖలో స్పష్టం చేశారు.

 

 ఆ లేఖ కాపీలను కర్ణాటక మంత్రిగా ఉన్న మల్లికార్జున ఖర్గే చిన్న కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే తన ‘ఎక్స్‌’హ్యాండిల్‌లో పంచుకున్నారు. సిద్ధార్థ విహార్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థలన్నీ లాభాపేక్ష లేని సంస్థలేనని, సీఏ స్థలం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, పొందడానికి ట్రస్టుకు పూర్తి అర్హత ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే.. దురుద్దేశంతో కూడి న, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను నిరంతరం ఎదుర్కొంటూ ఏ విద్యాసంస్థా సమర్థవంతంగా పనిచేయదని, సామాజిక సేవే లక్ష్యంగా నడుస్తు న్న ట్రస్టును వివాదాల్లోకి నెట్టడం ఇష్టం లేకే ప్రతి పాదనను ఉపసంహరించుకుంటున్నట్లు కేఐఏడీబీకి ట్రస్టు లేఖ రాసిందని మంత్రి తెలిపారు.  

ఇటీవల అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన తనయుడు రాహుల్‌ ఖర్గేలకు చెందిన సిద్ధార్థ విహార్‌ ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల భూమిని మంజూరు చేసింది. కాగా, సిద్ధార్థ విహార్‌ ట్రస్టుకు భూమి కేటాయించడాన్ని బీజేపీ ఐటీ విభాగం ఇంచార్జ్‌ అమిత్‌ మాలవీయ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లహర్‌సింగ్‌ సిరోయాలు ఎక్స్‌లో వేదికగా ప్రశ్నించారు. ఇది కచ్చితంగా అధికార దురి్వనియోగం, బంధుప్రీతితో వ్యవహరించడమేనని పేర్కొన్నారు. కేఐఏడీబీ భూమి పొందడానికి ఖర్గే కుటుంబ సభ్యులు ఏరోస్పేస్‌ పారిశ్రామిక వేత్తలుగా ఎప్పడు మారారని ఎద్దేవా చేశారు. ముడా ప్లాట్ల కేటాయింపుల విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో 14 సైట్లను మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి ఆమె తిరిగి ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు