Breaking News

ఎన్నికల ప్రచారం ఆఖరి క్షణంలో ఖర్గే సభ రద్దు!

Published on Wed, 11/15/2023 - 13:27

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంగా ప్రచారానికి సిద్ధమైన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నిరాశ ఎదురయ్యింది. ఈ నెల 17న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఈరోజే (నవంబరు15) చివరిరోజు కావడంతో అన్ని పార్టీలు తమ ప్రచారాలను హోరెత్తించాయి.

ఈరోజు బేతుల్ జిల్లా ఆమ్లాలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారధ్యంలో బహిరంగ సభ, ర్యాలీ జరగాల్సి ఉంది. అయితే ఇంతలో ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిముషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సివచ్చింది.  

మల్లికార్జున ఖర్గే బుధవారం ఉదయం 11.20 గంటలకు ఆమ్లాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉందని, అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా బహిరంగ సభ రద్దు అయ్యిందని స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. బెరాసియా, భోపాల్‌లలో జరిగే ర్యాలీలలో కూడా ఖర్గే పాల్గొనాల్సి ఉందని ఆయన తెలిపారు. నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బుధవారం చివరి రోజు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ అభ్యర్థి కన్నుమూత.. 25న ఓటింగ్‌ రద్దు!

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)