Breaking News

పండుగపూట విషాదం.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి

Published on Mon, 03/31/2025 - 07:10

కులు: హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లోని కులు పరిధిలోగల మణికరణ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మృతిచెందారు. బలమైన గాలుల కారణంగా ఒక భారీ వృక్షం రోడ్డుపై నిలిపివుంచిన వాహనాలపై పడింది. అదే సమయంలో కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు.

ఈ ప్రమాదంపై హిమాచల్‌ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు(CM Sukhwinder Singh Sukhu) విచారం వ్యక్తం చేశారు. ప్రమాదప్రాంతంలో తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మణికరణ్‌ ప్రముఖ మతపరమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఆదివారం నాడు రాష్ట్రంలో ‘నవ సంవత్’ ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.  

ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు ఎవరన్నదీ ఇంతవరకూ గుర్తించలేదు. పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు. ఈ  దుర్ఘటనలో ఆరుగురు మరణించినట్లు కులు సబ్‌ డివిజినల్‌  మేజిస్ట్రేట్‌ అశ్విని కుమార్ తెలిపారు.  ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆదివారం గురుద్వారా ముందు నిలిపివుంచిన తమ వాహనాలలో  కూర్చున్న పర్యాటకులపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు