బరిలో ప్రముఖ సింగర్‌.. బీజేపీ నేతలతో భేటీ

Published on Mon, 10/06/2025 - 17:04

న్యూఢిల్లీ: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. పార్టీలలో ఉత్సాహం పెరిగింది. టిక్కెట్ల ఆశావహులు వివిధ పార్టీలలో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ గాయని మైథిలి ఠాకూర్ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్‌లను కలుసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమె త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దర్భంగా నుండి బీజేపీ టికెట్‌పై పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

వినోద్ తావ్డే తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో మైథిలి ఠాకూర్‌తో సమావేశం అయిన ఫొటోలను షేర్‌ చేశారు. 1995లో లాలూ ప్రసాద్ యాదవ్ పదవీకాలంలో బీహార్‌ను విడిచిపెట్టిన మైథిలి ఠాకూర్‌ కుటుంబం రాష్ట్ర పురోగతిని చూసిన తర్వాత తిరిగి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నట్లు తావ్డే ఆ పోస్ట్‌లో తెలిపారు. కాగా మైథిలి ఠాకూర్ తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో ‘బీహార్  అభివృద్ధి కోసం కలలుకనే వ్యక్తులను కలుసుకున్నాను. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

మైథిలి ఠాకూర్ బీహార్‌లోని మధుబనిలోని బెనిపట్టికి చెందినవారు. ఆమెను ఎన్నికల సంఘం బీహార్ 'స్టేట్ ఐకాన్'గా కూడా నియమించింది. భారతీయ శాస్త్రీయ, జానపద సంగీతంలో శిక్షణ పొందిన ఆమె, బీహార్ జానపద సంగీతానికి చేసిన కృషికి గాను 2021లో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్‌ను అందుకున్నారు. ఆమె తన ఇద్దరు సోదరులతో పాటు, తాత, తండ్రి నుండి జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు.
 

రాబోయే ఎన్నికలు ప్రధానంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కి చెందిన తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌ మధ్య పోటాపోటీగా ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం 243 మంది సభ్యులున్న అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగియనుంది. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)