Breaking News

రీల్స్‌ కోసం కెమెరా కొనేందుకు ఓనర్‌ ఇంట్లో చోరీ

Published on Sun, 07/21/2024 - 21:25

ఢిల్లీ: ఇన్‌స్ట్రామ్‌లో రీల్స్‌ చేసి ఫేమస్‌ కావాలనుకున్న ఓ పని మనిషి కెమెరా కొనుక్కొవటం కోసం.. ఓనర్‌ ఇంట్లోనే రూ.లక్షల విలువైన బంగారు నగలను చోరీ చేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకొంది. నగలతో పరారైన ఆమెను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వివరాలు.. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ బంగ్లాలో నీతూ యాదవ్‌  అనే మహిళ పని చేస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా ఫేమస్‌ కావాలనుంది.

అందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసి పోస్టు చేస్తుండేది. అక్కడితో ఆగకుండా యూట్యూబ్‌ ఒక ఛానెల్‌ను ఓపెన్‌ చేసి డబ్బు సంపాదించాలిని ప్లాన్‌ వేసింది. అయితే దానికి రీల్స్‌ చేసేందుకు మంచి క్వాలిటీ ఉన్న  డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా కొనాలనుకుంది. అయితే ఆమె వద్ద అంత డబ్బు లేకపోవడంతో కుటుంబ సభ్యులును డబ్బు అడిగింది.

 కానీ వారం సహాయం చేయకపోవటంతో తాను పనిచేసే ఓనర్‌ ఇంట్లోనే చోరీ చేయాలని నిర్ణయించుకుంది. ఓనర్లు లేని సమయం చూసి బంగారం, వెండి వస్తువులతో పారిపోయింది. ఇంట్లో కనిపించని ఆమెకు ఒనర్లు కాల్‌ చేస్తే.. ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వచ్చింది.   ఇంట్లో ఉండే నగలు కనిపించకపోవడంతో పనిమనిషిపై వచ్చి.. ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఇక.. స్థానికుల సమాచారంతో నగల బ్యాగ్‌తో ఢిల్లీ దాటాలనుకున్న ఆమెన పోలీసులు అరెస్టు చేశారు. అయితే కెమెరాను కొనడానికి  ఎవ్వరు  అప్పుగానైనా డబ్బు ఇవ్వకపోవటంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడి అయినట్లు పోలీసులు తెలిపారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)