Breaking News

యూసుఫ్ పఠాన్‌కు మహువా స్ట్రాంగ్ వార్నింగ్!

Published on Tue, 06/09/2026 - 08:25

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చోటుచేసుకున్న తిరుగుబాట్లు  ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 20 మంది లోక్‌సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) వైపు అడుగులు వేస్తున్నారనే ఊహాగానాల మధ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామాల దరిమిలా టీఎంసీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రా తిరుగుబాటుదారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ మ్యాండేట్‌ను ఉల్లంఘించి ఎన్డీఏతో చేతులు కలపాలని చూస్తున్న వారిని స్వార్థపరులుగా, దేశద్రోహులుగా ఆమె అభివర్ణించారు.

‘వెన్నెముక ఉండాలి'.. యూసుఫ్ పఠాన్‌పై ఆగ్రహం
మహువా మోయిత్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌' లో చేసిన ఒక పోస్ట్‌లో మాజీ క్రికెటర్, టీంఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్‌ను నేరుగా టార్గెట్ చేశారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘అమిత్ షా పిలిచారని మీరు ఢిల్లీకి పరిగెడుతున్నారా? కాస్త ధైర్యం ప్రదర్శించండి. మీరు భారతదేశం తరపున ఆడారు. మా జిల్లా ప్రజలు మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించారు. కాస్త సిగ్గు, వెన్నెముక ఉండాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తీర్పు టీఎంసీకి ఇచ్చినదని, ఎన్డీఏకు కాదని ఆమె స్పష్టం చేశారు.

బీజేపీ టికెట్‌పై గెలవాలని సవాల్
పార్టీ మారే ఆలోచనలో ఉన్న అసమ్మతి ఎంపీలకు మహువా మోయిత్రా ఒక బహిరంగ సవాల్ విసిరారు. పసుపు రంగు మరకలున్న ప్యాంట్లు వేసుకున్న స్వార్థపూరిత దేశద్రోహులంతా వెంటనే బీజేపీలో చేరవచ్చని, అయితే ముందుగా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసి, తిరిగి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ వెలుపల వారి ఎన్నికల బలం ఎంతో నిరూపించుకోవాలని, అప్పుడే వారు ఎంతటి వీరులో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

తల వంచేది లేదు: కాకోలి ఘోష్ దస్తీదార్
మరోవైపు లోక్‌సభలో ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లు కోరిన 20 మంది అసమ్మతి ఎంపీల గ్రూపులో ఉన్న రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ ఈ విమర్శలపై ఘాటుగానే స్పందించారు. ‘నా తల తెగినా వంగేది లేదు, నేను ఇప్పటికే చాలా భరించాను’ అని ఆమె మీడియా సంస్థ ‘ఏఎన్‌ఐ’తో అన్నారు. తానేమీ 2011లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలోకి రాలేదని, గత 40 ఏళ్లుగా ఇక్కడే పోరాడుతున్నానని చెప్పారు. తనకు జాతీయ ప్రయోజనాలు, దేశ భద్రత మాత్రమే ముఖ్యమని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: బీపీలకు, టెన్షన్లకు చెక్.. డాంకీలతో మైండ్ బ్లోయింగ్ ట్రీట్‌మెంట్!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)