Breaking News

COVID-19: వెయ్యిదాటిన కేసులు.. దేశమంతటా అప్రమత్తం

Published on Mon, 05/26/2025 - 12:32

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2020 నుండి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న అంటు వ్యాధి తిరిగి దేశంలో అంతకంతకూ ప్రభలుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి చేరిందని కేంద్ర కోవిడ్‌ నియత్రణ విభాగం తెలియజేసింది. ప్రస్తుతం రాజధాని ఢిల్లీలో 104 యాక్టివ్ కేసులు ఉండగా, వాటిలో 99 కేసులు గత వారంలోనే నమోదయ్యాయి.

మహారాష్ట్రలో ఆదివారం కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరింది. ముంబైలో కొత్తగా 35  కేసులు నమోదు కాగా, పూణేలో  కొత్తగా ఎనిమిది కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో జనవరి నుంచి ఇప్పటివరకూ మొత్తం 300 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 248 కేసులు నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలోని మొత్తం ఇన్ఫెక్షన్లలో 82.67 శాతం. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళ(Kerala)లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తరువాత స్థానంలో తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. ఢిల్లీలో కూడా నమోదవుతున్న కేసులలో స్వల్ప పెరుగుదల కనిపించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటివి. వీటికి గృహ సంరక్షణలో చికిత్స అందిస్తున్నారు.

సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల్లో కోవిడ్‌-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.  ఈ నేపధ్యంలో భారత్‌లో నమోదువున్న కేసుల విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Ministry of Health) అప్రమత్తంగా ఉందని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో కొత్తగా కోవిడ్‌-19 వేరియంట్ ఎన్‌బీ.1.8.1కు చెందిన ఒక కేసు, ఎల్‌ఎప్‌.7కి చెందిన నాలుగు కేసులను గుర్తించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) (డబ్ల్యూహెచ్‌ఓ) ఎల్‌ఎఫ్‌.7,  ఎన్‌బీ.1.8 సబ్‌వేరియంట్‌లను ‘వేరియంట్స్‌ అండర్ మానిటరింగ్’ (వీయూఎం)లుగా వర్గీకరించింది. వేరియంట్స్‌ ఆఫ్ కన్సర్న్ (వీఓసీ) లేదా వేరియంట్స్‌ ఆఫ్ ఇంటరెస్ట్ (వీఓఐ)గా పేర్కొంది. చైనా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్‌-19 కేసుల పెరుగుదలకు కారణమైన వేరియంట్‌లు ఇవేనని తెలిపింది. దేశంలో ప్రస్తుతం అత్యంత సాధారణ వేరియంట్ జేఎన్‌.1 వ్యాప్తిలో ఉంది. తరువాత బీఏ.2 (26శాతం), ఇతర ఓమిక్రాన్ సబ్‌లైనేజ్‌లు (20శాతం) ఉన్నాయి.

ప్రస్తుతం కోవిడ్‌-19 కేసులతో పోరాడుతున్న రాష్ట్రాల జాబితాలో కేరళ 430 కేసులతో అగ్రస్థానంలో ఉంది. తరువాత 209 కేసులతో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉంది. ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది. గుజరాత్‌లో 83 కేసులు, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో నాలుగు, కేరళలో రెండు, కర్ణాటకలో ఒకటి చొప్పున కోవిడ్‌-19 మరణాలు నమోదయ్యాయి.  ఇప్పటివరకూ అండమాన్, నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జ‍మ్ముకశ్మీర్‌లలో ఎటువంటి యాక్టివ్ కేసులు నమోదు కాలేదు.

ఇది కూడా చదవండి: నీట్‌కు ప్రిపేర్‌ అవుతూ.. నెలలో రెండో ‘ఉదంతం’

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)