Breaking News

‘మహా’ పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్‌.. మంత్రి పదవుల కోసం కొత్త ఫార్ములా!

Published on Wed, 12/04/2024 - 08:51

ముంబై: మహారాష్ట్రలో పొలిటికల్‌ సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండగా.. మంత్రి పదవులపై చర్చ నడుస్తోంది. మహాయుతి కూటమిలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో గెలిచిన సీట్ల ప్రకారం.. ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను ఒక మంత్రి దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.

మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా బీజేపీ, శివసేన, ఎన్‌సీపీలకు ఎన్ని మంత్రి పదవులు వస్తాయనే చర్చ నడుస్తోంది. పార్టీ వర్గాల ప్రకారం.. 6-1 ఫార్ములాను అమలు చేసే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని సమాచారం. మూడు పార్టీల నుంచి ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది.

ఈ లెక్క ప్రకారం మహారాష్ట్రలో అత్యధిక స్థానాల్లో(132) బీజేపీ విజయం సాధించడంతో కాషాయ పార్టీలో 20-22 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏక్‌నాథ్‌ షిండే శివసేనకు 12, అజిత్‌ పవార్‌ ఎన్సీపీకి 9-10 పదవులు దక్కే చాన్స్‌ ఉన్నట్టు సమాచారం. అయితే, శాఖలపై కూడా చర్చ జరుగుతోందని సమాచారం. కీలక శాఖలు బీజేపీకే దక్కే చాన్స్‌ ఉంది. దీంతో, శివసేన, ఎన్‌సీపీలకు ఏయే శాఖలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)