Breaking News

మహారాష్ట్రలో బిగ్‌ ట్విస్ట్‌.. యూబీటీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం

Published on Sat, 12/07/2024 - 13:50

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ‘మహావికాస్ అఘాడీ’ కూటమి ఎమ్మెల్యేలు నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. దీంతో, వారి నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రతిపక్ష కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. ఈ మేరకు విషయాన్ని యూబీటీ ఎమ్మెల్యే ఆధిత్య థాక్రే వెల్లడించారు. ఈ సందర్బంగా థాక్రే మాట్లాడుతూ.. నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో యూబీటీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయడం లేదు. ఎన్నికల సందర్బంగా ఈవీఎంల విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే అందుకు నిరసనగా నేడు ప్రమాణస్వీకారం చేయడం లేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేరు. ఈవీఎంల విషయంలోను తప్పు జరిగింది. ప్రజలిచ్చిన తీర్పు అయితే వారంతా సంతోషంగా ఉండేవారు. అలా జరగలేదు కాబట్టే ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదని ఆరోపించారు.

మరోవైపు.. ఆధిత్య థాక్రే వ్యాఖ్యలపై మహాయుతి కూటమి నేతలు కౌంటర్‌ అటాక్‌ ఇచ్చారు. ప్రతిపక్ష కూటమి నేత చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం. అవసరమైతే న్యాయస్థానాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలి అంటూ సూచనలు చేశారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యేలుగా దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌తో సహా పలువురు ప్రమాణం చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)