Breaking News

పెళ్లయ్యి ఏడాది కాలేదు, డెంటిస్ట్‌ అత్మహత్య : మంత్రి సన్నిహితుడు అరెస్ట్‌

Published on Mon, 11/24/2025 - 14:29

Dentist Suicide case  ముంబై:  హత్యారోపణల కింద మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే  (Pankaja Munde) ముఖ్య సన్నిహితుడిని పోలీసలు అరెస్టు చేయడం  కలకలం రేపింది. పంకజ ముండే వ్యక్తిగత సహాయకుడు అనంత్ గార్జేని ముంబైలోని వర్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య గౌరీ గార్జే ఆత్మహత్య కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. 

అనంత్‌ భార్య గౌరీ శనివారం సాయంత్రం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే  భర్త ఆమెపై వేధింపులకు పాల్పడి, తీవ్రంగా హింసించాడని, అవి భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందన్న గౌరీ కుటుంబం ఆగ్రహం  వ్యక్తం చేసింది.  గార్జేకు వివాహేతర సంబంధం ఉందని మరొక మహిళతో మొబైల్ ఫోన్‌లో చాట్ చేస్తుండగా పట్టుబట్టాడని, దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆరోపించారు.  దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్-కెమెరా పోస్ట్‌మార్టం ,సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ద్వారా కేసు దర్యాప్తు చేయాలని  డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చసిన పోలీసులు  సోమవారం తెల్లవారు జామున వర్లీ పోలీసులు గార్జేను అరెస్టు చేసి, కోర్టులో హాజరపర్చారు.

గౌరీ ప్రభుత్వ కెఇఎం ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పని చేస్తున్నారు.  అనంత్‌, గౌరీ వివాహం ఈ ఏడాది  ఫిబ్రవరి 7న  జరింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి పంకజ ముండే, మాజీ ఎంపీ ప్రీతమ్ ముండే సహా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే పెళ్లి అయ్యి ఇంకా  ఏడాది కూడా నిండకుండానే ఆమె బలవన్మరణానికి పాల్పడడం పలు అనుమానాలకు  తావిస్తోంది. 

ఇదీ చదవండి: బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)