Breaking News

రెచ్చిపోయిన పోకిరీకి, యువతి గుణపాఠం : వీడియో వైరల్‌

Published on Sat, 07/18/2026 - 15:02

మహారాష్ట్రలోని భూసావల్-వర్ధా ప్యాసింజర్ రైలులో  ఒక యువతి తన  ధైర్యసాహసాలతో నెట్టింట వైరల్‌గా మారింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోకిరీకి విచిత్రమైన రీతిలో, జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. తోటి ప్యాసింజర్లు కూడా ఆమెకు తోడవడంతో, నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.  తద్వారా వేధింపులకు భయపడి మౌనంగా ఉండకుండా గట్టిగా ప్రతిఘటించాలనే ధైర్యాన్నిచ్చింది.

కదులుతున్న రైలులో ఒక యువకుడు ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అంతే అసాధారణ ధైర్యం ప్రదర్శించి, తోటి ప్రయాణికుల సహాయంతో అతడిని పట్టుకుంది.ఆ పోకిరీకి చేతులకు గాజులు తొడిగి, పెదవులకు లిప్‌స్టిక్ పూసి అవమానించింది. ఆ కంపార్ట్‌మెంట్‌లోని చాలా మంది ఆ మహిళను చప్పట్లతో అభినందిస్తూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. 

ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్‌ : నిద్రలేమే వరంలా మారింది

  వేధింపులపై మౌనంగా ఉండకుండా నిలబడిన ఈ సాహసికి, ఆమె తోటి ప్రయాణికులకు విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ ఘటన  మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారి తీసింది. అయితే గాజులు, బొట్టు పెట్టడం అంటే తిరిగి మనల్ని మనం అవమానించుకున్నట్టే.. కానీ ఏదో విధంగా ప్రతిఘటించడం అభినందనీయం అంటున్నారు కొంతమంది. మహిళలు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురైనప్పుడు పక్కన ఉన్నవారు జోక్యం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను మరికొందరు నొక్కి చెప్పారు.  ఇలాంటి పోకిరీలకు తగిన శిక్ష విధించేలా అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 

 ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్‌ సక్సెస్‌ స్టోరీ

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)