మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ జోరు

Published on Sun, 12/21/2025 - 19:26

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ సంచలన విజయం సాధించింది. 288 పంచాయతీ పరిషత్ స్థానాలకు గానూ 120 సీట్లు సాధించి సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా నిలిచింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ఈ ఎన్నికలలో పెద్దగా ప్రభావితం చూపలేకపోయింది. ఈ విజయంపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆనందం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాషాయ పార్టీ జోరు నడుస్తో్ంది. దేశవ్యాప్తంగా ఏ ఎన్నిక జరిగినా బీజేపీ అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మెున్నటికి మెున్న కేరళ కమ్యూనిస్టుల కోటైన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకోగా, తాజాగా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలోనూ ఆ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.  ఈ విజయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.  

ఫడ్నవీస్ మాట్లాడుతూ "ఎన్నికల ప్రచారంలో నేను ఏ పార్టీని, నాయకుడిని విమర్శించలేదు. నా ప్రణాళికలను వివరించాను. ప్రజలు దానిని అంగీకరించారు. అని ఫడ్నవీస్ అన్నారు. ఈ విజయం పట్ల ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే స్పందించారు. మహాయుతి కూటమి లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించిందని దానికి మద్ధతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో బిీజేపీ 120 సీట్లు సాధించగా, శిండే శివసేన 57 స్థానాలు, అజిత్ ఎన్సీపీ 37 సీట్లు గెలిచుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇందులో కాంగ్రెస్ 31, ఉద్దవ్ శివసేన 10, శరద్ పవార్ ఎన్సీపీ 10 సీట్లు గెలిచాయి. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 246 మున్సిపల్‌ కౌన్సిళ్లు, 46 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. 

మున్సిపల్ కార్పొరేషన్ సమరంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ముంబైతో పాటు మరో 29 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలకు వచ్చే నెల ఎన్నికలు జరగనున్నాయి.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)