Breaking News

కరెక్ట్‌ కాదు.. గైక్వాడ్‌ వీడియోపై ఫడ్నవిస్‌ స్పందన

Published on Wed, 07/09/2025 - 15:10

శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ అసహనం వ్యక్తం చేశారు. పప్పు బాగోలేదంటూ క్యాంటీన్‌ ఆపరేటర్‌ను గైక్వాడ్‌ చితకబాదిన సంగతి తెలిసిందే. రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఫడ్నవిస్‌ స్పందించారు. 

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌(Sanjay Gaikwad) తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని అన్నారాయన. ‘‘ఆయన వీడియో చూశాను. ఇలాంటి ప్రవర్తన సరికాదు. ప్రజాప్రతినిధుల ప్రతిష్టను మసకబార్చేదిగా ఉంది. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు భావించే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ఫిర్యాదుల ద్వారా పరిష్కరించాలే తప్ప.. ఇలా దాడులతో కాదు’’ అని ఫడ్నవిస్‌ మీడియాతో అన్నారు. 

శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌.. ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్‌లో పప్పు బాగోలేదంటూ క్యాంటీన్‌ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గైక్వాడ్‌ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నారు. పాడైపోయిన ఆహారం పెడుతున్నారంటూ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని అన్నారాయాన. అంతేకాదు.. వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని చెబుతున్నారాయన.

మరోవైపు సంజయ్‌ గైక్వాడ్‌ దాడి వీడియోపై ఉద్దశ్‌ శివసేన వర్గం భగ్గుమంది. అయితే.. సంజయ్‌ గైక్వాడ్‌కు వివాదాలు కొత్తేం కాదు. కిందటి ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బుల్దానా నియోజకవర్గం నుంచి షిండే శివసేన తరఫున కేవలం 841 ఓట్ల తేడాతో గైక్వాడ్‌ గెలుపొందారు.

2024 సెప్టెంబర్‌లో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆయన నాలుక కోసిన వారికి ₹11 లక్షల బహుమతి ప్రకటించారు. రాహుల్‌ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు బీసీలకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయంటూ గైక్వాడ్‌ ఈ ప్రకటన చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.

2024 ఏప్రిల్‌లో.. మహారాష్ట్ర పోలీసులను ప్రపంచంలోనే అత్యంత అసమర్థమైన అధికారులుగా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫడ్నవిస్‌ అసహనం వ్యక్తం చేస్తూ ఏక్‌నాథ్‌ షిండేకు ఫోన్‌ చేశారు. ఆపైన గైక్వాడ్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

2023 మార్చిలో.. ఒక యువకుడిని పోలీస్ లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ అయింది.

2021లో.. అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ కరోనాను రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శిస్తూ.. కరోనా గనుక తన చేతికి దొరికితే ఫడ్నవిస్‌ నోట కుక్కి కథ ముగిస్తానంటూ వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకుగానూ బీజేపీ ఆయనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

1987లో పులిని వేటాడానని చెబుతూ.. దాని పళ్లను లాకెట్‌గా ధరించానని చెప్పడంతో వన్యప్రాణుల చట్టం ఉల్లంఘన కింద సంజయ్‌ గైక్వాడ్‌ మీద కేసు నమోదైంది.

తాజాగా: ముంబయిలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో పాడైపోయిన పప్పు ఇచ్చారన్న కారణంతో కాంటీన్ సిబ్బందిని చెంపదెబ్బతో కొట్టిన వీడియో వైరల్ అయింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)