Breaking News

‘మహా’ ఎన్నికలు: తుది ఓటర్ల జాబితా విడుదల.. మహిళా ఓటర్లే అధికం

Published on Thu, 10/31/2024 - 16:11

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి (బీజేపీ, అజిత్‌ పవార్‌(ఎన్సీపీ), షిండే(శివసేన), ప్రతిప్రక్షాల మహా వికాస్‌ అఘాడీ కూటమి (కాంగ్రెస్‌, ఠాక్రే (శివసేన), శరద్‌ పవార్ (ఎన్సీపీ) ప్రచారంతో దూసుకుపోతున్నాయి.  ఈ క్రమంలో  తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. 

ఇక.. తుది ఓటర్ల జాబితా ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 4 కోట్లమంది పురుష ఓటర్లు, 4.7కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన అక్టోబర్ 15, అసెంబ్లీ ఎన్నికలకు ముందు నమోదుకు చివరి తేదీ అక్టోబర్ 19 మధ్య సుమారు 6.55 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. కూటమి పార్టీల గెలుపులో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారని ఎన్నికల విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)