Breaking News

మరాఠాల రిజర్వేషన్‌కు ఓకే

Published on Wed, 02/21/2024 - 06:06

ముంబై: మహారాష్ట్రలో విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ సంబంధిత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇందుకోసం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో మహారాష్ట్ర రాష్ట్ర విద్య, సామాజిక వెనుకబాటు బిల్లు–2024ను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే ప్రవేశపెట్టారు. రాష్ట్రజనాభాలో మరాఠాలు 28 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో మరాఠాలకు అమలయ్యే 10 శాతం రిజర్వేషన్‌ను పదేళ్ల తర్వాత సమీక్షిస్తారు. ‘‘రాష్ట్రంలో భిన్న కులాలు, వర్గాలకు ఇప్పటికే 52 శాతం రిజర్వేషన్‌లు అమలవుతున్నాయి.

ఇందులోనే ఓబీసీలకు19 శాతం రిజర్వేషన్‌ కలిసి ఉంది. అంటే దేశంలో పరిమిత 50 శాతం మార్కును దాటి రిజర్వేషన్లు అమలవుతున్నాయి’’ అని బిల్లులో పేర్కొన్నారు. ‘‘తమిళనాడులో 69 శాతం, హరియాణాలో 67 శాతం, రాజస్థాన్‌లో 64 శాతం, బిహార్‌లో 69 శాతం, గుజరాత్‌లో 59 శాతం, పశ్చిమబెంగాల్‌లో 55 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

ఓబీసీ కోటాలో కాకుండా రాష్ట్రంలో మరాఠాలకు విడిగా రిజర్వేషన్‌ ఇస్తున్నాం’’ అని సీఎం అన్నారు. వ్యవసాయ ఆధారిత కుంబీ కులానికి చెందిన మరాఠాలకు, వారి రక్తసంబందీలకు మాత్రమే కుంబీ కుల ధ్రుజీవీకరణ పత్రమిస్తామని ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొంది.
 

విడిగా కోటా వద్దు: జరాంగే మరాఠాలకు విడిగా కాకుండా ఓబీసీ రిజర్వేషన్లలోనే కోటా కావాలని ఉద్యమనేత మనోజ్‌ జరాంగే డిమాండ్‌ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)