Breaking News

డీజీపీ హెచ్చరిక.. యూనిఫాంతో డాన్సులు చేయద్దు

Published on Sun, 10/02/2022 - 10:22

సాక్షి, ముంబై: పోలీసులు యూనిఫాంలో ఉండగా ఊరేగింపుల్లో, శుభకార్యాల్లో ఎలాంటి నృత్యాలు  చేయకూడదని రాష్ట్ర డీజీపీ రజ్‌నీశ్‌ సాఠే ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ధరించే యూనిఫాంకు ఒక విలువ ఉందని, పెళ్లి వేడుకలు, పండుగలు, పబ్బాలు, ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో నృత్యం చేస్తూ దాని విలువ దిగజార్చవద్దని హెచ్చరించారు. ‘అనేక సందర్భాలలో పోలీసులు వివిధ ఊరేగింపుల్లో డీజే పాటలపై నృత్యం చేస్తున్నట్లు వీడియోలలో కనిపిస్తోంది. కొందరు కావాలనే పోలీసులను బలవంతంగా డ్యాన్స్‌ చేయించి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

దీనివల్ల యావత్‌ పోలీసు డిపార్టుమెంట్‌కు అపకీర్తి వస్తుంది. కొందరు నిర్వాకం వల్ల మిగతా పోలీసులకు చెడ్డ పేరు వస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన గణేశ్‌ నిమజ్జనోత్సవాల్లో ముంబైసహా పుణేలో కొందరు పోలీసులు డీజే సౌండ్‌లకు ఉత్తేజితులై నృత్యం చేశారు. ఉత్సవాల్లో భక్తులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా సినిమా పాటలకు నృత్యం చేస్తే శాంతి, భద్రతలు ఎలా అదుపులో ఉంటాయనే అంశం తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం కంటే దుర్వినియోగం ఎక్కువ చేస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా కూడా కొందరు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. దీంతో పోలీసు శాఖను అన్ని రంగాలవారు లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రజ్‌నీశ్‌ సాఠే ఇక ముందు ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులు డ్యాన్స్‌లు చేయవద్దని హెచ్చరించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో అధికారికంగా జారీ చేయనున్నట్లు తెలిపారు. పోలీసులు కచ్చితంగా నియమాలను పాటించాలని, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు. ఒకవేళ సామాజిక కార్యక్రమాలకు హాజరు కావాల్సి వస్తే వ్యక్తిగతంగా యూనిఫాం లేకుండా వెళ్లాలని సూచించారు.  

Videos

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి పోరాడుతాం: బొత్స

Nizamabad: ముగ్గురు చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు శంకర్

తమ్మినేని సీతారాం హౌస్ అరెస్ట్... ఆముదాలవలసలో ఆందోళన

Sahasra Mother: హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర..!

బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ రియాక్షన్

కూకట్‌పల్లి పీఎస్ వద్ద సహస్ర కుటుంబసభ్యుల ఆందోళన

ఏడు అంశాల అజెండాగా పీఏసీ సమావేశం

నాకు నటించాల్సిన అవసరం లేదు కూన రవికుమార్ బండారం బయటపెట్టిన సౌమ్య

కూటమి ప్రభుత్వంలో పెన్షనర్ల కూడు లాక్కుంటున్నారు

Sahastra Incident: క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకే బాలుడు వెళ్లాడు: సీపీ మహంతి

Photos

+5

కాబోయే మరదలితో రిబ్బన్‌ కట్‌ చేసిన సారా.. సచిన్‌ పుత్రికోత్సాహం (ఫొటోలు)

+5

పట్టుచీరలో చందమామలా.. అనసూయ కొత్త ఫొటోలు

+5

ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)

+5

తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)