Breaking News

కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్‌

Published on Sun, 02/02/2025 - 10:26

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. కుంభమేళాలో కనిపించిన కొందరు వ్యక్తులు కూడా అందరి నోళ్లలో నానుతున్నారు. వారిలో ఒకరే కుంభమేళాలో పూసల దండలు అ‍మ్మేందుకు వచ్చిన తేనెళ్ల మోనాలిసా. ఆమె తాజాగా మరో వీడియో విడుదల చేసింది.

కుంభమేళా మోనాలిసా(Kumbh Mela Mona Lisa)కు సంబంధించిన పలు వీడియోలు, రీల్స్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. దీంతో ఆమె విధిరాత మారిపోయిందంటున్నారు. త్వరలోనే ఆమె సినిమాల్లో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ‘డైరీ ఆఫ్ మణిపూర్’ అనే చిత్రంలో నటించనున్నదని, ఇందుకోసం ఆమె సంబంధిత ప్రాజెక్టుపై సంతకం చేసిందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంతలో, తాజాగా మోనాలిసా మరో వీడియోను వీడుదల చేశారు. దీనిలో ఆమె సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలకు, ఊహాగానాలకు వివరణ ఇచ్చారు.

ఆ వీడియోలో మోనాలిసా మాట్లాడుతూ ‘హలో.. నేను మోనాలిసా. నేను రుద్రాక్ష దండలు అమ్మడానికి మహా కుంభమేళాకు వెళ్లాను. మహాదేవుని అనుగ్రహంతో పాటు అందరి ఆశీస్సులతో నేను రాత్రికి రాత్రే ప్రసిద్ధి చెందాను. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
 

మీ అందరి దయతోనే నాకు ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’(‘The Diary of Manipur’) అనే సినిమాలో అవకాశం వచ్చింది. దీనికి డైరెక్టర్ సనోజ్ మిశ్రా. ఆయన మా ఇంటికి వచ్చి  అగ్రిమెంట్‌ కుదుర్చుకుని వెళ్లారు. హీరోయిన్ కావాలనేది నా కోరిక. అది ఈరోజు  నెరవేరబోతోంది. మీ అందరి ఆశీస్సులు ఇలాగే కొనసాగాలి. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. ప్రస్తుతం నేను నటన నేర్చుకోబోతున్నాను. ఆ తరువాత సినిమాల్లో నటిస్తాను. మోనాలిసా లక్షలు  సంపాదిస్తోందని సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఎవరో నాకు కారు ఇచ్చారని కూడా రాశారు. ఇవన్నీ అబద్దాలే. అయితే సనోజ్ మిశ్రా జీ ముంబై నుండి వచ్చి నాకు సినిమా ఆఫర్‌ ఇచ్చారు. ఇకపై నేను ముందుకు సాగడానికి మీరందరూ నన్ను ఆశీర్వదించండి’ అని మోనాలిసా కోరారు.

ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్‌ యాత్రికులు మృతి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)