Breaking News

తొక్కిసలాట ఘటన.. ప్రధాని నాలుగుసార్లు ఫోన్‌ చేశారు: సీఎం యోగి

Published on Wed, 01/29/2025 - 10:16

లక్నో: మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఈ ఉదయం మీడియాతో స్పందించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయని చెప్పారాయన. అలాగే ఈ ఘటనపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని తెలిపారాయన. 

‘‘నిన్న రాత్రి నుంచి మౌని అమావాస్య పుణ్య స్నానాలు మొదలయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా నెలకొంది. అయినా  అమృత స్నానాలు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ తగ్గాక తాము స్నానాలకు వెళ్తామని అఖాడాలు తెలిపారు. ఈ ఉదయం 8గం. వరకే దాదాపు 3 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌కి ఇవాళ 8-10 కోట్ల మంది వస్తారని అంచనా. 

.. గత రాత్రి తొక్కిసలాట జరిగింది. అఖాడ మార్గం గుండా వెళ్లి స్నానాలు చేయాలని కొందరు భక్తులు ప్రయత్నించారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన భక్తులను ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రధాని మోదీ ఇప్పటికే నాలుగుసార్లు ఫోన్‌ చేసి పరిస్థితిపై ఆరా తీశారు, కేంద్ర మంత్రి అమిత్‌ షా,గవర్నర్‌ కూడా ఘటన గురించి చర్చించారు ’’ అని యోగి ప్రకటించారు.  అలాగే.. త్రివేణి సంగం వద్దకు కాకుండా  ఎక్కడికక్కడే ఘాట్లకు వెళ్లి స్నానం చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉంటే.. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. సుమారు 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ కాగా.. త్రివేణి సంగమానికి 30 కిలోమీటర్ల వరకే అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు కాలినడకన చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సెక్టార్‌ 2 వద్ద తొక్కిసలాటలో పలువురికి గాయాలు కాగా చికిత్స అందుతోంది. ఘాట్‌ వెంట కిక్కిరిసిన భక్తులతో కిలోమీటర్‌ మేర బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో ఊపిరాడని పరిస్థితుల నడుమ భక్తులు నలిగిపోయారు. తీవ్రంగా గాయపడిన 50 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  అయితే పది నుంచి 15 మంది మరణించారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. దీనిని అధికారులు ధృవీకరించాల్సి ఉంది.

ఇదీ చదవండి: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. జరిగింది ఇదే!

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)