Breaking News

ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి

Published on Thu, 02/27/2025 - 07:04

ప్రయాగ్‌రాజ్‌: మొన్నటి జనవరి 13న ప్రారంభమమై, ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగిన మహా కుంభమేళా(Maha Kumbh Mela) పరిసమాప్తమయ్యింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో అద్భుమైన రీతిలో హారతినిచ్చారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.
 

మహాకుంభమేళా పూర్తయిన నేపధ్యంలో డీఎం రవీంద్రకుమార్‌ మందర్‌ మాట్లాడుతూ ‘మహా కుంభ్‌కు కేవలం మనదేశం నుంచే కాకుండా యావత్‌ ప్రపంచం నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చారు. ఇక్కడికి వచ్చినవారంతా మహాకుంభమేళా నియమనిబంధనలన్నింటినీ పాటించారు. వారందరికీ ధన్యవాదాలు. మహాకుంభమేళా పూర్తయిన తరుణంలో ఇక్కడికి వచ్చినవారు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం సంగమ ఘాట్లలో పరిశుభ్రతా చర్యలు చేపడుతున్నాం. మహాశివరాత్రి(Mahashivratri) రోజున రాత్రి 8 గంటల వరకూ త్రివేణీ సంగమంలో 1.53 కోట్లమంది పవిత్రస్నానాలు చేశారు. కుంభమేళా జరిగిన 45 రోజుల్లో మొత్తం 66.30 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు’ అని తెలిపారు.

మహాకుంభ్‌ ముగిసిన తరుణంలో నేడు(గురువారం) యూపీ సీఎం యోగి ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)కు రానున్నారు. కుంభమేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుంభమేళా అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేయనున్నారు. అలాగే ఇక్కడి పారిశుద్ధ్య కార్మికులకు, ఆరోగ్య సేవలు అందించిన సిబ్బందికి, పడవ నడిపిన నావికులకు సన్మానం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.30కి సీఎం యోగి లక్నో చేరుకోనున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రయాగరాజ్‌కు వచ్చి, కుంభమేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

ఇది కూడా చదవండి: మే 2 నుంచి కేదార్‌నాథ్‌ దర్శనం.. శివరాత్రి వేళ ప్రకటన

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)