మహా కుంభమేళాకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తజనం

Published on Fri, 02/21/2025 - 12:39

లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం.. మహా కుంభమేళా మరో ఐదురోజుల్లో ముగియనుంది. చివరి వారాంతం కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఇవాళ 40వ రోజు ఉదయం రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిట్లు అధికారులు ప్రకటించారు.

కుంభమేళా ముగుస్తుండడంతో ప్రయాగ్‌రాజ్‌(Prayagraj) సంగమంకు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. మేలా ప్రాంతంలో హోటల్స్‌, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. గురువారం సాయంత్రం గణాంకాల ప్రకారం.. మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. శని, ఆది వారాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

గత వారంగా కుంభమేళా భక్తుల సంఖ్య👇

  • ఫిబ్రవరి 13, గురువారం: 80 లక్షల 46 వేలు

  • ఫిబ్రవరి 14 శుక్రవారం: 94 లక్షల 98 వేలు

  • ఫిబ్రవరి 15 శనివారం: కోటి 36 లక్షల మంది

  • ఆదివారం:  కోటి 49 లక్షల మంది

  • సోమవారం: కోటి 35 లక్షల మంది

  • మంగళవారం : కోటి 26 లక్షల మంది

  • బుధవారం: కోటి 19 లక్షల మంది

  • గురువారం: కోటి 55 లక్షల మంది..

ఇక.. కుంభమేళా(KumbhmelaI నిర్వహణపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జనవరి చివరి వారంలో మౌనీ అమవాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే  రద్దీని నియంత్రించేలా అధిక సిబ్బందిని నియమించారు. మరోవైపు.. పరిసరాలను, సంగమ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే వీఐపీ పాస్‌లను రద్దు చేసిన అధికారులు.. వాహనాల రాకపై కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

రైల్వే శాఖ కీలక నిర్ణయం
మహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగుస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారు. రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో  రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్టేషన్‌లలో ప్రత్యేక హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించింది. సురక్షిత ప్రయాణం కోసం తాము సూచించే మార్గదర్శకాలను పాటించాలని అందులో విజ్ఞప్తి చేస్తోంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట చోటు చేసుకుని 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)