Breaking News

Bihar Election: మహాకూటమి కీలక హామీలివే..

Published on Tue, 10/28/2025 - 12:55

పట్నా: ఛట్‌ ఉత్సవ సందడి ముగియడంతో బీహార్‌లోని అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహిస్తున్నాయి. మహాకూటమి (మహాఘట్‌ బంధన్‌), నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతలో కాంగ్రెస్‌ నేత కృష్ణ అల్లవారు మహాకూటమి కీలక హామీలను వెల్లడించారు.

మహాకూటమి బీహార్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయకముండే కాంగ్రెస్ నేత వెల్లడించిన కీలక హామీలివే..

మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం రూ. 2,500

రూ. 25 లక్షల వరకు వైద్య చికిత్సకు సాయం

భూమి లేని కుటుంబాలకు భూమి కేటాయింపు

రాజధాని పట్నాలో నేడు(మంగళవారం)  మహాకూటమి  తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది. దీనిలో ఉపాధి, ద్రవ్యోల్బణం, విద్య, రైతుల సంక్షేమం తదితర అంశాలు ఉండనున్నాయని సమాచారం.  మరోవైపు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)తమ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది.

27 మంది తిరుగుబాటు నేతల బహిష్కరణ
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై 27 మంది నేతలను పార్టీ నుండి ఆరేళ్లపాటు బహిష్కరించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ జాబితాలో వివిధ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగిన లేదా అధికారిక ఆర్‌జేడీ అభ్యర్థులను వ్యతిరేకిస్తున్న నేతలు ఉన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)