Breaking News

Mahakumbh-2025: యోగి ప్రభుత్వానిదే బాధ్యత: కాంగ్రెస్‌

Published on Wed, 01/29/2025 - 11:38

మహా కుంభమేళాలో మౌని అమావాస్య వేళ జరిగిన తొక్కిసలాటకు యోగి ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. మహా కుంభమేళాకు ఏర్పాట్లు చేయడానికి బదులుగా, ప్రభుత్వం ప్రచారంలో బిజీగా ఉందని కాంగ్రెస్ ప్రతినిధి అన్షు అవస్థి ఆరోపించారు. భక్తులను పట్టించుకునేందుకు బదులుగా ప్రభుత్వం తన ఫోటో సెషన్‌లో బిజీగా ఉందన్నారు. ఇకనైనా ప్రభుత్వం వీఐపీ సంస్కృతిని విడనాడి, భక్తులకు భద్రత కల్పించాలని కోరారు.

కుంభమేళాలో నిర్వహణ లోపం, సన్నాహాలలో నిర్లక్ష్యం, తగిన ఏర్పాట్లు లేకపోవడం కారణంగానే తొక్కిసలాట జరిగిందని, దీనికి బీజేపీ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలని అన్షు అవస్థి  పేర్కొన్నారు. మహా కుంభమేళా బడ్జెట్‌ అంతా అవినీతితో నిండిపోయిందని ఆరోపించారు.  కుంభమేళా మొదటి రోజు నుండే తాము భక్తుల రద్దీ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం భక్తులకు తగిన విధంగా  అవగాహన కల్పించి ఉంటే, ఈ తొక్కిసలాటను నివారించగలిగేదన్నారు. వీఐపీ స్వాగత సంస్కృతిని ఆపాలని, బడ్జెట్‌లో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని యోగి సర్కార్‌కు అన్షు అవస్థీ విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: ఆ లోపాలే తొక్కిసలాటకు కారణం: మల్లికార్జున ఖర్గే

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)