Breaking News

Maha Kumbh: వేల రూపాయలు తెచ్చిపెట్టిన ‘పర్సు చోరీ’

Published on Wed, 02/19/2025 - 13:19

ప్రయాగ్‌రాజ్‌: కుంభమేళాలో స్నానం చేస్తే తాము చేసిన పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అయితే దీనికి విరుద్ధంగా కొందరు కుంభమేళా ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతూ పాపాలను మూటగట్టుకుంటున్నారు. మధురలోని బృందావనాన్ని సందర్శించి, అక్కడినుంచి కుంభమేళాకు వచ్చిన ఒక వ్యక్తికి చేదు అనుభం  ఎదురయ్యింది. జనసమూహంలో అతని పర్సు చోరీకి గురయ్యింది. ఆ పర్సులో నగదు, విలువైన కాగితాలు  ఉన్నాయి. దీంతో అతను కాసేపు బాధపడ్డాడు. తిరిగి తన స్వస్థలానికి చేరడం ఎలా అని ఆలోచించాడు. వెనువెంటనే ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు.

జేబులో ఒక్కపైసా కూడా లేకపోవడంతో మరోమార్గం లేక అక్కడున్న కొందరు భక్తులకు తన పరిస్థితి చెప్పుకుని, డబ్బులు సాయం చేయాలని కోరాడు. వారిచ్చిన డబ్బుతో టీ తయారు చేసి విక్రయించసాగాడు. ఇలా కుంభమేళాలో రోజుకు రెండు, మూడు వేలు సంపాదిస్తూ రూ. 50 వేలు జమచేశాడు.

పర్సుపోతే పోయిందిగానీ, అతనికి ఒక కొత్త ఉపాధి మార్గం దొరికింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నేను బృందావనం నుంచి మహాకుంభమేళాలో స్నానం చేసేందుకు వచ్చాను. ఇంతలో నా పర్సు ఎవరో చోరీ చేశారు. ఏం చేయాలో తెలియక టీ విక్రయిస్తూ, డబ్బులు కూడబెట్టాలని నిర్ణయించుకున్నాను. రాత్రనక, పగలనక ఇక్కడికి వచ్చే భక్తులకు టీ అమ్ముతూ వచ్చాను. రోజుకు మూడు వేల రూపాయల వరకూ సంపాదించాను. అలా  ఇప్పటివరకూ రూ. 50 వేలు కూడబెట్టాను’ అని తెలిపాడు.  

ఇది కూడా చదవండి: శివాజీ జయంతి: చిన్న లక్ష్యంతో మొదలుపెట్టి..

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)