Breaking News

మహాకుంభ్‌తో నిండిన రైల్వే ఖజానా.. ఎంత ఆదాయమంటే..

Published on Thu, 03/13/2025 - 07:50

ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)కు కోట్లాది మంది జనం తరలివచ్చారు. ఫలితంగా యూపీ సర్కారుకు లెక్కలేనంత ఆదాయం సమకూరింది.  కుంభమేళాకు వచ్చేందుకు జనం ప్రధానంగా రైళ్లను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడిపింది.

నెలన్నర పాటు జరిగిన మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్(Prayagraj) లోని ఎనిమిది రైల్వే స్టేషన్ల నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లిన రైళ్ల ద్వారా రైల్వేశాఖకు టిక్కెట్ల విక్రయాల రూపంలో దాదాపు రూ.200 కోట్లు సమకూరాయి. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్‌కు చెందిన డీఆర్‌ఎం హిమాన్షు బదోనీ, సీనియర్ డీసీఎం హిమాన్షు శుక్లా తెలిపిన వివరాల ప్రకారం మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని నార్త్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని నాలుగు రైల్వే స్టేషన్లలో రూ.159.20 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అలాగే ఉత్తర రైల్వేలోని లక్నో డివిజన్‌లోని మూడు రైల్వే స్టేషన్ల నుండి రూ.21.79 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈశాన్య రైల్వేలోని వారణాసి డివిజన్‌లోని రెండు రైల్వే స్టేషన్ల నుండి రూ.6 కోట్ల విలువైన టిక్కెట్లను విక్రయించడం ద్వారా రైల్వేలు అధిక ఆదాయాన్ని ఆర్జించాయి. 2019 కుంభమేళాలో రైల్వేశాఖ  86 కోట్ల రూపాయల విలువైన టిక్కెట్లను విక్రయించింది.

మహాకుంభమేళాకు ఊహించనంత సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని, అయితే రైల్వేశాఖ(Railways) గత మూడేళ్లుగా ముందస్తు చర్యలు చేపట్టిన కారణంగా ఎక్కడా ఎటువంటి సమస్య రాలేదని డిఆర్‌ఎం హిమాన్షు బదోనీ తెలిపారు. ఇదిలావుండగా రైల్వేశాఖ 2031లో జరగబోయే కుంభమేళా కోసం ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం మూడు రకాల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయోధ్య, వారణాసి, మీర్జాపూర్,  చిత్రకూట్‌లను కలుపుతూ రైళ్లను నడపాలని అధికారులు యోచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Hit and Run: కారు బీభత్సం.. నలుగురు మృతి

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)