Breaking News

Mahakumbh 2025: నేడు అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పవిత్ర స్నానాలు

Published on Thu, 01/16/2025 - 09:08

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దీనిలో దేశవిదేశాలకు చెందినవారు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు (గురువారం) పవిత్ర తీవేణీ సంగమంలో పది దేశాల నుంచి వచ్చిన 21 మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం  పవిత్ర స్నానాలు ఆచరించనుంది. వీరి పర్యటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్యావేక్షిస్తోంది.

నేడు ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో పవిత్ర స్నానాలు ఆచరించే ప్రతినిధి బృందంలో ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యూఎఈ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈ పుణ్యస్నానాలు ఆచరించే ముందు ఈ బృందం సభ్యులు వారసత్వ నడకను చేపట్టారు. ఈ  సందర్భం వీరు ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని తెలుసుకున్నారు. వీరు బస చేసేందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది.

ఈ ప్రతినిధి బృందం పుణ్యస్నానాలు ఆచరించిన అనంతం హెలికాప్టర్(Helicopter) ద్వారా మహా కుంభ్ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేయనుంది. కాగా గంగా, యమున, పౌరాణిక సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ కుంభమేళాకు 45 కోట్ల మంది వరకూ యాత్రికులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇది కూడా చదవండి: Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)