Breaking News

చివరి ఊపిరి… ట్రక్కు కిందే!

Published on Sun, 12/21/2025 - 11:07

చలికాలం.. మిట్ట మధ్యాహ్నాం.. సూర్యుడి వెచ్చని కిరణాల్ని ఆస్వాదిస్తూ తన ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చున్నాడు ఆ పెద్దాయన. కానీ, ఒక్క నిమిషంలోనే ఆయన జీవితం తలకిందులైంది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో 90 ఏళ్ల గిర్రాజ్ శర్మ అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఒక ట్రక్కు కింద నలిగిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నెట్టింటకు చేరాయి. డిసెంబర్‌ 19వ తేదీన మధ్యాహ్నాం 12-1 గంట మధ్య ఈ ఘటన జరిగింది.

గిర్‌రాజ్‌ శర్మ తన ఇంటి వరండాలో కూర్చుని ఉన్నారు. ఇంతలో కంకర లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. ఆయన ఇంటి ముందు నుంచి మలుపు తిరిగింది. అయితే ఆ టర్నింగ్‌లో రోడ్డు సరిగ్గా లేక టైర్‌ పేలిపోయింది. ఈ పరిణామంతో వాహనం కంట్రోల్‌ కాకపోవడంతో.. పక్కకు ఒరిగి గిర్‌రాజ్‌ మీదకు ఒరిగిపోయింది. అలా ఊహించలేని దుర్ఘటన ఆ వృద్ధుడి ప్రాణం తీసింది.

ఆరోగ్యంగా ఉన్న గిర్‌రాజ్‌ ఇలా అనూహ్యంగా ప్రాణం పొగొట్టకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు.. రోడ్డు భద్రత, భారీ వాహనాల నిర్వహణపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)