Breaking News

Guna: బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహనం

Published on Thu, 12/28/2023 - 06:42

బోఫాల్‌: మధ్యప్రదేశ్‌ గుణ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును(డంపర్‌) ఢీ కొట్టింది. దీంతో మంటలు చెలరేగగా.. 12 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు కాగా.. జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంటున్నారు.

గుణ నుంచి ఆరోన్‌ వెళ్తుండగా రాత్రి 9గం. సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సు అతివేగంతో వెళ్లడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మరో నలుగురు ప్రమాదం నుంచి బయటపడి.. వాళ్ల ఇళ్లకు వెళ్లిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై గుణ కలెక్టర్‌ తరుణ్‌ రతి దర్యాప్తునకు ఆదేశించారు. 


గుణ బస్సు ప్రమాదంపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు ఘటనపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సైతం స్పందిస్తూ.. బాధించిందన్నారు. ఘటనపై స్థానిక అధికారులతో తాను మాట్లాడినట్లు.. అలాగే మృతుల కుటుంబాలకు తన సంతాపం చెబుతూ ఎక్స్‌లో ఓ సందేశం ఉంచారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)