Breaking News

రెండు వాహనాలను ఢీకొన్న గ్యాస్‌ ట్యాంకర్.. ఏడుగురు మృతి

Published on Thu, 03/13/2025 - 11:28

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ రెండు వాహనాలను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్‌ రాంగ్‌ రూట్‌లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. బద్నావర్-ఉజ్జయిని హైవేలోని బమన్సుత గ్రామ సమీపంలోని రోడ్డుపై గ్యాస్ ట్యాంకర్ రాంగ్‌ రూట్‌(Wrong route) నుండి వస్తూ, ఎదురుగా వస్తున్న ఒక కారు, జీపును బలంగా ఢీకొంది. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని ధార్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో మృతిచెందారు.

ప్రమాదం గురించి సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్రేన్ సహాయంతో వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన వారిని రత్లం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్‌కు ముప్పుగా మారిందా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)