Breaking News

విమానం టేకాఫ్‌ విఫలం.. తప్పిన పెను ప్రమాదం..

Published on Sun, 09/14/2025 - 13:23

లక్నో: లక్నో ఎయిర్‌ పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. లక్నో-ఢిల్లీలో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రన్‌వేపై వేగం అందుకున్న తర్వాత విమానం టేకాఫ్‌ విఫలమైంది. అతి కష్టంపై పైలట్‌.. విమానాన్ని రన్‌ వే ముగిసే ముందు నిలిపివేశారు. విమానంలో ఎంపీ డింపుల్‌ యాదవ్‌తో పాటు 151 మంది ప్యాసింజర్లు ఉన్నారు.

శనివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం 6ఈ-2111 టేకాఫ్ కోసం సిద్ధమైంది. ఈ విమానం సాధారణంగా  లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. రన్‌వేకు చేరుకుని ప్రయాణికులు విమానం ఎక్కారు. టేకాఫ్‌కు ముందు ఇంజిన్లు శక్తిని పుంజుకోవడంతో విమానం ఒకేసారి పైకి లేస్తుంది. కానీ, ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ కాలేదు. . ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విమానంలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు గోండా ఎస్పీ నాయకుడు సూరజ్ సింగ్ తాము లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్నామని వారు ఈ సంఘటనను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. వేగంగా వెళ్తున్న విమానం ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీకి తరలించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌  ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.

లక్నో-ఢిల్లీ ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)