Breaking News

పేరు మార్చి ప్రేమ నాటకం.. నిలదీస్తే కారు ఎక్కించిన ప్రియుడు

Published on Wed, 09/16/2026 - 18:54

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో దారుణ ఘటన జరిగింది. తనను మోసం చేశాడని అడ్డుకున్న ప్రియురాలిపై ప్రియుడు ఏకంగా కారు ఎక్కించాడు.  లక్నోలోని ప్రఖ్యాత జనేశ్వర్ మిశ్రా పార్క్ సమీపంలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రియుడిని నిలదీసిన యువతిపై, నిందితుడు రాక్షసంగా వ్యవహరించిన తీరు సర్వత్రా ఆందోళనలు రేకెత్తిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. అనామిక అనే యువతి, షహన్వాజ్  కొంతకాలంగా పరిచయంలో ఉన్నారు. అయితే, మరో యువతితో షహన్వాజ్ కారులో తిరుగుతుండగా అనామిక రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో  గొడవకు దిగింది. వివాదం ముదిరడంతో  షహన్వాజ్ కారులో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, యువతి అడ్డుకునే యత్నం చేసింది. 

అయితే ఆ సమయంలోనూ తన ప్రియుడు ఏమాత్రం  కనికరం చూపకుండా కారుతో వేగంగా కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా కిందపడిపోయిన ఆమెపైకి వాహనం ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన లక్నో పోలీసులు, ప్రధాన నిందితుడు షహన్వాజ్‌ను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే సదరు యువతిని పేరు మార్చి (యష్ ఠాకూర్) పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)