Breaking News

mahakumbh: 27 ఏళ్ల క్రితం అదృశ్యం.. నేడు అఘోరిగా ప్రత్యక్షం

Published on Thu, 01/30/2025 - 07:16

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వేడుకగా సాగుతోంది. ఈ కుంభమేళాలో పలు ఆసక్తికర ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతమొకటి  ఇప్పుడు వైరల్‌గా మారింది.

27 ఏళ్ల క్రితం త‍మ కుటుంబం నుంచి తప్పిపోయిన ఒక వ్యక్తిని కుంభమేళాలో  కనుగొన్నామని జార్ఖండ్‌కు చెందిన ఒక కుటుంబం మీడియాకు తెలిపింది. దీంతో తమ 27 ఏళ్ల ఆవేదన ఇప్పుడు తీరిపోయిందని వారు ఆనందంగా చెబుతున్నారు. నాడు  ఇంటి నుంచి తప్పిపోయిన  గంగాసాగర్ యాదవ్ వయసు ఇప్పుడు 65 ఏళ్లు. ఇప్పుడాయన అఘోరి సాధువుగా కుటుంబ సభ్యులకు దర్శనమిచ్చారు. ఇప్పుడు అతని పేరు బాబా రాజ్ కుమార్.

1998లో గంగాసాగర్‌ కుటుంబ సభ్యులంతా బీహార్‌లోని పట్నాకు వెళ్లారు. అప్పుడు గంగాసాగర్‌ అదృశ్యమయ్యాడు. దీంతో అతని భార్య ధన్వ దేవి ఇంటి బాధ్యతలను భుజానికెత్తుకుని వారి కుమారులు కమలేష్, విమలేష్‌లను పెంచిపెద్దచేసింది. గంగాసాగర్ తమ్ముడు మురళీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ‘తమ సోదరుడిని తాము మళ్లీ చూస్తామనే ఆశను కోల్పోయాం. అయితే కుంభమేళాకు వెళ్లిన మా బంధువులలో ఒకరు గంగాసాగర్ ఫోటో తీసి మాకు పంపారు. దీంతో నేను, ధన్వా దేవి, వారి ఇద్దరు కుమారులతో కలిసి కుంభమేళాకు  వెళ్లాం.

అక్కడ గంగాసాగర్‌ను గుర్తించాం. అయితే అతను తన పూర్వపు గుర్తింపును అంగీకరించేందుకు నిరాకరించారు. పైగా తాను బాబా రాజ్‌కుమార్‌ను అని చెబుతూ, వారణాసికి చెందిన సాధువును అని తెలిపాడు. అయితే తాము ఆయన నుదిటిపై, మోకాలిపై ఉన్న గాయాల గుర్తులును చూశాకనే ఆయనను గంగాసాగర్ యాదవ్‌గా గుర్తించాం. కుంభమేళా ముగిసే వరకు ఇక్కడే ఉంటాం. అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తాం. అవి సరిపోలకపోతే బాబా రాజ్‌కుమార్‌కు క్షమాపణలు చెబుతాం’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: సంగమ తీరంలో.. ఢిల్లీకి నాలుగింతల జనాభా

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)