Breaking News

యువత కళ్లలోకి చూసే ధైర్యం  మోదీకి ఉందా? 

Published on Fri, 07/24/2026 - 05:08

న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో రక్తమోడిన యువత కళ్లలోకి నేరుగా చూసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా? అని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రశ్నించారు. యువతకు అన్ని దారులు మూసుకుపోయాయని, ఇక వారు ఎక్కడికి వెళ్లాలని అన్నారు. నరేంద్ర మోదీ హయాంలో విద్యా వ్యవస్థ క్షీణించిపోయిందని ఆరోపించారు. ప్రజలకు ఊరట మాటలు గానీ, శాంతి ప్రకటనలు గానీ అవసరం లేదన్నారు. మోదీ ప్రభుత్వం యువతపై లాఠీచార్జి చేసిందని, సొంత పిల్లలు కానట్లుగా నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. ఈ మేరకు ఖర్గే గురువారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.

 ‘‘మీ ఏసీ గదుల విలాసవంతమైన కోటల నుంచి బయటకు రండి. మీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ వీధుల్లో రక్తమోడ్చిన యువతీ యువకుల కళ్లలోకి నేరుగా చూడండి’’అని మోదీకి తేలి్చచెప్పారు. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నేరవేర్చాలని స్పష్టంచేశారు. దేశంలో విద్యా వ్యవస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ గుప్పిట్లో చిక్కుకుందని ఖర్గే ఆరోపించారు. మోదీ చేసిన ప్రకటన కంటితుడుపు చర్యగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ అభివరి్ణంచారు. యువత దీన్ని అంగీకరిస్తారనే భ్రమలో ప్రధానమంత్రి ఉన్నారని ఆక్షేపించారు.  

టూ లిటిల్, టూ లేట్‌  
పేపర్‌ లీక్‌ల దోషులను శిక్షించడానికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రధానమంత్రి ప్రకటనను కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ‘చాలా తక్కువ, చాలా ఆలస్యం’అని కొట్టిపారేశారు. అది మోసపూరితమైన ప్రకటన అని విమర్శించారు. విద్యార్థులు అలాంటి తక్కువ స్థాయి చర్యలను అంగీకరించలేరని పేర్కొన్నారు. పేపర్‌ లీకేజీలను నివారించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)