Breaking News

లండన్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య..

Published on Wed, 08/14/2024 - 15:55

ముంబై: ముంబై నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో (ఏఐ129)  సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్‌ అయిన కొద్ది సమయానికే విమానాన్ని తిరిగి ముంబైకు దారి మళ్లించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో  విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు ఎయిర్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు. అనంతరం విమానానికి ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

‘ముంబై నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానం AI129లో సాంకేతిక సమస్య కారణంగా ముంబైకి తిరిగి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము’ అని ఎయిర్‌ ఇండియా వెల్లడించింది.

విమానయాన సంస్థ ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అంతేగాక విమాన టికెట్ రద్దుపై ప్రయాణీకులకు విమాన ఛార్జీల పూర్తి వాపసును కూడా అందించినట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సుకు సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా సదరు అధికారి పేర్కొన్నారు.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)